నేడు ఛత్తీస్‌గఢ్ సీఎం ఖరారు?

నేడు ఛత్తీస్‌గఢ్ సీఎం ఖరారు?
x
Highlights

తాజాగా మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ముఖ్యమంత్రులను ఖరార్ చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం. ఇక మిగిలిన ఒక్క రాష్ట్రంపైనే దృష్టిసారించింది. అదే ఛత్తీస్...

తాజాగా మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ముఖ్యమంత్రులను ఖరార్ చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం. ఇక మిగిలిన ఒక్క రాష్ట్రంపైనే దృష్టిసారించింది. అదే ఛత్తీస్ గఢ్ సిఎం అభ్యర్థిపై నేడు ప్రకటించనుంది అదిష్ఠానం. పీసీసీ చీఫ్‌ భూపేశ్‌ బఘేల్‌, విపక్షనేత టి.ఎస్‌.సింగ్‌దేవ్‌, చరణ్‌దాస్‌ మహంత్‌, తామ్రధ్వజ్‌ సాహు ముఖ్యమంత్రి పదవికి పోటీపడుతున్నారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఆదివారం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, యుపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ఛత్తీస్‌గఢ్‌ పరిశీలకుడు ఖర్గే ఈ చర్చల్లో పాల్గొన్నారు. భూపేశ్ బఘేల్‌, టీఎస్‌ సింగ్‌దేవ్ మధ్యే ప్రధాన పోటీలో ఉన్నారు. కాగా వీరిద్దరిలో సిఎం ఎవరు అనేది రాహుల్ ఆదివారం ప్రకటించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories