కర్రపెండలం దోశ తయారీ ఎలా?

కర్రపెండలం దోశ తయారీ ఎలా?
x
Highlights

కర్రపెండలంలో 60 శాతం నీరు ఉంది. ఒక్క గుక్కలో తినే దుంపలో 157 కెలారీల శక్తి వుంది. ఇందులో 389 గ్రాముల పిండిపదార్థం, 1.2 గ్రాముల లవణాలు, 0.6 గ్రాముల...

కర్రపెండలంలో 60 శాతం నీరు ఉంది. ఒక్క గుక్కలో తినే దుంపలో 157 కెలారీల శక్తి వుంది. ఇందులో 389 గ్రాముల పిండిపదార్థం, 1.2 గ్రాముల లవణాలు, 0.6 గ్రాముల పీచుపదార్థం, 0.7 గ్రాముల మాంసకృతులు, 0.2 గ్రాముల క్రొవ్వు ఉంది. కాల్షియం లవణం అధికంగా వుంది. కాని మాంసకృత్తులు ఎక్కువగా లేకపోవడం వలన ఎక్కువ ఫోషకవిలువలు లేవు.

తయారీ విధానం :

బియ్యం: అరకిలో

శనగపప్పు : రెండు టేబుల్ స్పూన్‌లు

కర్రపెండలం: అరకిలో

10 ఎండుమిర్చి

జీలకర్ర

ఇంగువ

ఉల్లిగడ్డలు

కరివేపాకు

ఉప్పు

నూనె

తయారీ విధానం :

ముందుగా కర్రపెండలాన్ని తోలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. బియ్యాన్ని శనగపప్పును నీటిలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో జీలకర్ర, ఇంగువ, నీటిలో నానబెట్టి పెట్టుకున్న ఎండుమిర్చి, బియ్యాన్ని వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. వీటన్నింటీ దోశ పిండిలా మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి..తరువాత కట్ చేసి పెట్టుకున్న కర్రపెండలం ముక్కలను గ్రైండ్ చేసుకోవాలి. పిండి రెడీ అయిన తరువాత . ఇందులో కట్ చేసి పెట్టకున్న ఉల్లిగడ్డ ముక్కలను వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వీటన్నింటి బాగా కలుపుకోవాలి. కొంచం కరివేపాకు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి...లైట్‌గా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దోశ పిండి తీసుకుని దోశ వేసుకోవాలి. దోశ చుట్టూ నూనె పోసుకోవాలి. దోశ ఒకవైపు కాలిన తరువాతా...దోశను తిప్పుకోవాలి. కర్రపెండలం దోశ రెడీ.

Show Full Article
Print Article
Next Story
More Stories