కాంగ్రెస్‌కు ఊహించని షాకిచ్చిన బీఎస్పీ

కాంగ్రెస్‌కు ఊహించని షాకిచ్చిన బీఎస్పీ
x
Highlights

బీజేపీయేత ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగలింది. UPA ఛైర్ పర్సన్ సోనియా గాంధీతో తన సమావేశాన్ని...

బీజేపీయేత ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగలింది. UPA ఛైర్ పర్సన్ సోనియా గాంధీతో తన సమావేశాన్ని రద్దు చేసుకుంటున్నట్టు BSP అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఎగ్జిట్ పోల్స్ వెలువబడిన మరుసటి రోజే మాయావతి ఈ నిర్ణయం తీసుకోవడం జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అటు యూపీఏ ఇటు NDA పక్షాలతో ఎలాంటి సమావేశాలు, భేటీలు ఉండవని బీఎస్పీ వర్గాలు స్పష్టం చేశాయి.

ఉత్తర ప్రదేశ్‌‌ ఎన్నికల్లో ఎస్పీతో కలిసి బీఎస్పీ 70 స్థానాల్లో పోటీ చేసింది. వాస్తవానికి కాంగ్రెస్‌తో కలిసి భేటి చేయాలని భావించినా ... మాయావతి అంగీకరించకపోవడంతో ఇరు పార్టీలు పోటీ చేశాయి. రాహుల్‌, సోనియా గాంధీ పోటీ చేస్తున్న రెండు స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో కలిసి పోటీ చేశాయి. ఈ నేపధ్యంలోనే మాయావతి ఈ నిర్ణయం తీసుకోవడంపై ఢిల్లీ వర్గాల్లో తీవ్ర చర్చకు తెరలేపింది. ఎన్నికల ప్రచారం సమయంలోనే కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ప్రచారం సాగించిన మాయావతి పరిస్ధితి ఇలాగే కొనసాగితే మధ్యప్రదేశ్‌, రాజస్ధాన్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాలకు మద్దతు కూడా రద్దు చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే బీఎస్పీ నాయకుడు సతీష్ మిశ్రా రాహుల్‌తో భేటి అవుతారనే ప్రచారం జరుగుతోంది. ఉత్తర ప్రదేశ్‌లో మెరుగైన స్థానాలు సాధిస్తారనే వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో అసలు ఈ భేటి జరుగుతుందా ? జరిగితే ఏయే అంశాలపై చర్చించనున్నారనే చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్‌కు ఊహించని షాకిచ్చిన బీఎస్పీ

Show Full Article
Print Article
Next Story
More Stories