తొలిసారి సోనియాతో చంద్రబాబు భేటీ.. ఫలితాల వ్యూహాలపై కీలక చర్చ

తొలిసారి సోనియాతో చంద్రబాబు భేటీ.. ఫలితాల వ్యూహాలపై కీలక చర్చ
x
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో సోనియా గాంధీ భేటీ అయ్యారు. తొలిసారి ఆయన సోనియాతో ముఖాముఖి అయ్యారు. ఎన్నికల అనంతరం ఫలితాలు, పరిణామాలపై చర్చిస్తున్నారు....

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో సోనియా గాంధీ భేటీ అయ్యారు. తొలిసారి ఆయన సోనియాతో ముఖాముఖి అయ్యారు. ఎన్నికల అనంతరం ఫలితాలు, పరిణామాలపై చర్చిస్తున్నారు. ఫలితాలకు ముందే ఎన్డీయేతర పక్షాలను ఏకం చేసేందుకు చంద్రబాబు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న చంద్రబాబు ఇవాళ ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవర్‌తో సమావేశం అయ్యారు. నిన్న మాయావతి, అఖిలేష్ యాదవ్‌తో జరిగిన భేటీ అంశాలను చంద్రబాబు వారికి వివరించారు. ఇవాళ్టితో తుది దశ పోలింగ్ ముగియనుండడంతో తదుపరి కార్యాచరణపై వారితో చర్చించారు. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఎలా ముందుకు వెళ్లాలన్నఅంశంపై కూడా వారు చర్చలు జరిపారు.

ఎన్నికల ఫలితాల ముందు ఎలా వ్యవహరించాలి, ఎన్నికల ఫలితాల తర్వాత ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై చంద్రబాబు, రాహుల్, శరద్ పవర్ వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల కంటే ముందే ఎన్డీయేతర కూటమి నేతలంతా ఒకసారి సమావేశం అయితే బాగుంటుందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. రెండు రోజుల వ్యవవధిలో రాహుల్‌తో చంద్రబాబు రెండుసార్లు భేటీ అయ్యారు. అయితే, కొద్దిసేపటి క్రితం సోనియాతో సమావేశమయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories