ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లింది.. ఆటోడ్రైవర్లు

ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లింది.. ఆటోడ్రైవర్లు
x
Highlights

హైదరాబాద్‌లో చోరీకి గురైన బస్సు కేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వివరించారు. మొత్తం...

హైదరాబాద్‌లో చోరీకి గురైన బస్సు కేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వివరించారు. మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు.హైదరాబాద్ సిబిఎస్ లో ఏప్రిల్ 24వ తేదీన అర్ధరాత్రి చోరీకి గురైన బస్సు ఘటనను చేజింగ్ వివరాలను నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. అబ్దుల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన కుషాయిగూడకు చెందిన ఆర్టిసి బస్సు ను నిందితులు తూప్రాన్ మీదుగా నాందేడ్ కు తీసుకు వెళ్లారని వివరించారు. పది కిలోమీటర్ల దూరంలో నిలిపి వేసి బస్సు యొక్క విడిభాగాలను విడగొట్టి నట్లు తెలిపారు. ఈ చోరీ కేసులో ఇద్దరు అన్నదమ్ములు కీలక పాత్ర వహించారని సిపి వివరించారు.నగరంలోని చిలకలగూడకు చెందిన అన్నదమ్ములు సయ్యద్‌ అబేద్, సయ్యద్‌ జహీద్‌ వృత్తిరీత్యా ఆటోడ్రైవర్లు. ఇలా వచ్చే ఆదాయంతో సంతృప్తి చెందక చోరీల బాటపట్టారు.

నిందితులు బస్సును మొత్తం 37 ముక్కలుగా చేశారని దీనిని తుక్కు గా చేసి విక్రయించాలనేది వారి ఆలోచన అని కేసును దర్యాప్తు చేసిన ఈస్ట్ జోన్ డీ సి పి రమేష్ రెడ్డి వివరించారు. వీరిద్దరికి దుబాయ్ లో భారీ వాహనాల నడిపిన అనుభవం ఉందని వీరిపై గతంలో పలు కేసులు ఉన్నట్లు వివరించారు. ఆవారాగా తిరుగుతూ జల్సాలకు అలవాటు పడ్డ నిందితులిద్దరూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారన్నారు. నాందేడ్ లో ఉండే నవీన్ తో డీల్ మాట్లాడుకొని సిబిఎస్ లో లో నిలిపి ఉంచిన కుషాయిగూడ డిపో బస్సు ను టార్గెట్ చేసి ఎత్తుకెళ్లిన నట్లు వివరించారు.

నాందేడ్ కు వెళ్లేదారిలో లో బస్సు మధ్యలో ఆగిపోతే క్రేన్ సహాయంతో 35 కిలోమీటర్లు తీసుకెళ్లి షెడ్డు కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. విలాసాలకు డబ్బు లేకపోవడంతో నిందితులు బస్సు ఎత్తుకు వెళ్ళామని ఒప్పుకున్నట్లు తమ విచారణలో వెల్లడైంది అన్నారు. మొత్తం లక్ష రూపాయలను డీల్ మాట్లాడుకుని 60 వేలు తీసుకున్నట్లు తెలిపారు. నిందితుల దగ్గర నుంచి 19500 రూపాయలు స్వాధీనం చేసుకున్నారని పోలీసులు ఈస్ట్జోన్ డిసిపి తెలిపారు. మహారాష్ట్ర కు చెందిన మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిసిన పోలీసులు త్వరలోనే పట్టుకుంటామని వివరించారు కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని సిపి అభినందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories