ఖమ్మం సభలో కేసీఆర్‌కు చంద్రబాబు కౌంటర్

x
Highlights

ఖమ్మంలో నిర్వహిస్తున్న మహాకూటమి బహిరంగసభ సందర్భంగా సరికొత్త ఘట్టం ఆవిష్కృమైంది. మొన్నటిదాకా ఉప్పూనిప్పుగా ఉన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఏపీ...

ఖమ్మంలో నిర్వహిస్తున్న మహాకూటమి బహిరంగసభ సందర్భంగా సరికొత్త ఘట్టం ఆవిష్కృమైంది. మొన్నటిదాకా ఉప్పూనిప్పుగా ఉన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులు ఒకే వేదికపై ఆశీనులయ్యారు. పక్కపక్కనే కూర్చుని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ప్రజాకూటమి సభలో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు కేసీఆర్‌కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌ను నిర్మించినట్లు తాను చెప్పినట్లు అంటున్నారని, తాను నిర్మించలేదని, సైబరాబాద్‌కు తన హయాంలో రూపకల్పన చేశామని చంద్రబాబు చెప్పారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేశామని గుర్తుచేశారు. తెలంగాణ అభివృద్ధికి తానెప్పుడూ అడ్డుపడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. విభజన హామీలను, ప్రత్యేక హోదాను ఏపీకి ఇవ్వలేదని తెలంగాణలో కూడా ఏ ఒక్క విభజన హామీని నెరవేర్చలేదని అన్నారు. విభజన హామీలపై కేంద్రాన్ని కేసీఆర్ ఒక్కమాట కూడా అడగలేదని విమర్శించారు. ఖమ్మం బహిరంగసభలో ప్రసంగిస్తూ, ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories