జేసీ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు

Submitted by arun on Thu, 07/19/2018 - 17:17
jcb

తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి కీలక సమయంలో అలకబూనారు. పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సమయంలోనే పార్లమెంట్ సమావేశాలకు జేసీ రాకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్‌గా తీసుకున్నారు. సాయంత్రంలోపు జేసీ వ్యవహారశైలిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతోనే అలక బూనినట్లు తెలుస్తోంది. మరోవైపు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి సీఎం చంద్రబాబు నాయుడుతో సచివాలయంలో భేటీ అయ్యారు. అనంతపురం టౌన్‌లో రోడ్ల విస్తరణ విషయంలో జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌ చౌదరి మధ్య విభేదాలు తలెత్తాయ్. జేసీ దివాకర్‌రెడ్డి రోడ్ల విస్తరణ చేయాలని చెబుతుంటే ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. 

English Title
Chandrababu serious on jc diwakar reddy issue

MORE FROM AUTHOR

RELATED ARTICLES