కేంద్రంపై నిప్పులు చెరిగిన చంద్ర‌బాబు

Submitted by lakshman on Tue, 03/13/2018 - 18:05
Andhra Pradesh chief minister N. Chandrababu Naidu (left), Union finance minister Arun Jaitley

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు వాడివేడిగా కొన‌సాగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు కేంద్రం ఏపీకి చేస్తున్న అన్యాయం గురించి చ‌ర్చించారు. నాడు రాష్ట్ర విభ‌జ‌న సంద‌ర్భంగా ప్రతిప‌క్షంలో బీజేపీ ఎన్నో హామీల్ని ఇచ్చింద‌ని, ఆ హామీల్లో ఎన్ని నెర‌వేర్చిందో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. అంతేకాదు ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇవ్వలేమ‌ని చెప్పిన కేంద్ర ఆర్ధిక‌మంత్రి అరుణ్ జైట్లీ ప్ర‌క‌ట‌న‌పై తూర్పార‌బ‌ట్టారు. 
 విభజనలో ఏపీ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని బాబు చెప్పారు. అయితే సెంటిమెంట్ ఆధారంగా తెలంగాణ ఇచ్చారని, అయితే సెంటిమెంట్ ఆధారంగా నిధులు రావని జైట్లీ ఎలా మాట్లాడుతారని బాబు ప్రశ్నించారు. విభజన తర్వాత ఏపీ రాష్ట్రానికి సుమారు 20 వేల 112 కోట్ల రెవిన్యూలోటు ఉందని బాబు చెప్పారు.
ప్రత్యేక హోదా కేంద్రం చేతిలోనే ఉందని 14వ, ఫైనాన్స్ కమిషన్ చెప్పిందని చంద్ర‌బాబు చెప్పారు.  అంతేకాదు రాష్ట్ర విభ‌జ‌న సంద‌ర్భంగా  ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకొనే విచక్షణ అధికారం కేంద్రానికే ఉందని ఫైనాన్స్ కమిషన్ చెప్పిన ప్రకటనను బాబు గుర్తు చేశారు. కేంద్రం ఏపీకి ఎందుకు నిధులు ఇవ్వ‌డంలేదో చెప్పాల‌నీ అన్నారు.   జీఎస్‌డీపీ ఎక్కువగా ఉందని ఏపీ రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోవడం సరైంది కాదని చంద్రబాబునాయు చెప్పారు.  నాలుగేళ్ళుగా బిజెపి హమీలను అమలు చేయలేదు రాష్ట్రాన్ని విభజన సమయంలో హమీలిచ్చిన కాంగ్రెస్, ఆనాడు విపక్షంలో ఉన్న బిజెపి ఏపీ రాష్ట్రానికి అండగా ఉంటామని హమీలు ఇచ్చాయని బాబు గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో బిజెపి నేతలు చేసిన ప్రసంగాలను ప్రస్తావించారు.

ఎన్నికల ప్రచారం సందర్భంగా మోడీ, వెంకయ్యనాయుడు, అమిత్ షా ప్రసంగాలను బాబు చదివి విన్పించారు. నాలుగేళ్ళైనా బిజెపి ఇచ్చినా హమీలు అమలు చేయలేదని చెప్పారు. రైల్వేజోన్ ఇవ్వడం కుదరదని అధికారి చెబుతున్నారు. రాజకీయంగా డైరెక్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని బిజెపిపై మండిపడ్డారు. 

English Title
chandrababu naidu speech about arun jaitley on ap assembly

MORE FROM AUTHOR

RELATED ARTICLES