శేషన్న కోసం కొనసాగుతున్న ఏపీ, తెలంగాణ పోలీసుల వేట

శేషన్న కోసం కొనసాగుతున్న ఏపీ, తెలంగాణ పోలీసుల వేట
x
Highlights

నయీం అనుచరుడు శేషన్న కోసం ఏపీ, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా వేట సాగిస్తున్నారు. నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత నుంచి శేషన్న కోసం గాలిస్తున్న పోలీసులు కర్నూల్‌...

నయీం అనుచరుడు శేషన్న కోసం ఏపీ, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా వేట సాగిస్తున్నారు. నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత నుంచి శేషన్న కోసం గాలిస్తున్న పోలీసులు కర్నూల్‌ జిల్లా సున్నిపెంటకు చెందిన మాజీ మావోయిస్టు వట్టి వెంకటరెడ్డి అలియాస్‌ వాలిని గుర్తించారు. ఆయన ఇంట్లో ఆదివారం ఏపీ, తెలంగాణ పోలీసులు సోదాలు చేపట్టారు. తనిఖీల్లో వెంకట్‌రెడ్డి ఇంట్లో పోలీసులు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. నయీమ్‌ మృతి తర్వాత శేషన్న కర్నూల్‌ జిల్లా బొల్లవరంలో వెంకటరెడ్డి బంధువుల ఇంట్లో తలదాచుకున్నట్లు తెలిసింది. అయితే దీనిపై పోలీసులకు సమాచారం అందిందని తెలుసుకున్న శేషన్న పరారయ్యాడు. అప్పటి నుంచి శేషన్న కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. శేషన్న దగ్గర భారీ డంపు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories