టీఆర్‌ఎస్‌తో పొత్తుకు చంద్రబాబు సంకేతాలు

Submitted by arun on Thu, 03/01/2018 - 10:34
babu

తెలంగాణ టీడీపీ భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై నేతలుకు దిశానిర్దేశం చేసిన బాబు తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేద్దామన్నారు. అయితే తెలంగాణలో పార్టీని కాపాడుకోవాలంటే పొత్తు అనివార్యమన్న చంద్రబాబు సమయం వచ్చినప్పుడు పొత్తుల గురించి ఆలోచిద్దామన్నారు. అంతేకాదు కార్యకర్తల అభిప్రాయం మేరకే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని నేతలకు స్పష్టంచేశారు. అయితే తెలంగాణలో టీడీపీతో పొత్తు బీజేపీ వద్దనుకుందన్న చంద్రబాబు ఉన్న పార్టీల్లో ఏదో ఒకదానితో వెళ్దామంటూ సంకేతాలు ఇచ్చారు. మరోవైపు మోత్కుపల్లి విలీనం వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ విలీనంపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదన్నారు.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో పొత్తుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంకేతాలు ఇచ్చారు. తెలుగు ప్రజలను నాశనం చేసింది కాంగ్రెస్‌ పార్టీయేనంటూ విరుచుకుపడ్డ చంద్రబాబు మిత్రపక్షం బీజేపీపైనా పరోక్షంగా సెటైర్లు వేశారు. తెలంగాణలో టీడీపీతో బీజేపీనే పొత్తు వద్దనుకుందన్నారు. అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బతికించుకోవాలంటే ఏదో పార్టీతో పొత్తు అనివార్యమన్న చంద్రబాబు ఎన్నికల టైమ్‌లో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే అటు కాంగ్రెస్‌ను ఇటు బీజేపీని చంద్రబాబు కాదనడంతో ఇక మిగిలింది టీఆర్‌ఎస్సే కావడంతో గులాబీ పార్టీతో పొత్తు ఖాయమనే సంకేతాలు ఇచ్చినట్లయ్యింది.  

English Title
chandrababu naidu hints at tie up with telangana rashtra samithi in telangana

MORE FROM AUTHOR

RELATED ARTICLES