హోదా పోరు చేస్తున్నది మేమే

Submitted by arun on Fri, 08/10/2018 - 11:47

హోదా పోరు చేయడానికి తామే నిజమైన అర్హులమంటూ చెబుతున్న వైసీపీ నిన్న గుంటూరులో వంచనపై గర్జన పేరుతో దీక్ష జరిపింది. తెలుగు దేశం ప్రభుత్వం  అనుసరించిన దురదృష్టకర విధానాల వల్ల రాష్ట్రం ఇవాళ నిస్సహాయ స్థితిలో పడిపోయిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

హోదా పోరులో వంచనపై గర్జన దీక్షలు చేస్తున్న వైసీపీ నిన్న గుంటూరు వేదికగా వంచన దీక్ష చేపట్టింది. వైసీపీ నేతలంతా నల్లని దుస్తులు ధరించి ఈ దీక్షలో పాల్గొన్నారు హోదా గురించి మొదట్నుంచి పోరాడుతున్నది వైసీపీయేనని హోదా గురించి ఆంధ్ర ప్రజలకు ఊరూరా తిరిగి వివరించిన వ్యక్తి జగన్ అని వైసిపి నేతలు చెబుతున్నారు. మొక్కవోని దీక్షతో జగన్ హోదా కోసం పోరుసల్పితే చివరి ఏడాదిలో టిడిపి యూటర్న్ తీసుకుందని వైసీపీ నేతలు విమర్శించారు.

గుంటూరు విఏఆర్ గార్డెన్స్ లో  చేపట్టిన వంచనపై గర్జన దీక్షకు వైసీపీ అగ్ర నేతలంతా హాజరయ్యారు. మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, సీనియర్ నేతలు బొత్స, పెద్దిరెడ్డిరాం చంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు తదితరులు ఈ దీక్షో పాల్గొన్నారు.అధికారంలోకి వస్తే అన్నీ ఇస్తామంటూ అటు బిజెపి, ఇటు టీడీపీ ఇద్దరూ ఏపి ప్రజలను మోసగించారని నాలుగేళ్లు పదవులు అనుభవించి, కేంద్రంతో అంటకాగి రాష్ట్రానికి తీరని నష్టం చేసి ఇప్పుడు ధర్మ పోరాట దీక్షలంటూ టిడిపి జనంలో తిరుగుతోందని వైసీపీ నేతలు ఎద్దేవా చేశారు.

హోదా అంశం అయిదు కోట్ల ప్రజల ఆకాంక్షగా మారడానికి కారణం వైసీపీయే నని ఈ విషయం ప్రజలకు తెలుసుననీ వైసీపీ చెబుతోంది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని చెబుతున్న టిడిపి ఇంకా చాటు మాటుగా బిజెపితో అంటకాగుతూనే ఉందని వైసీపీ విమర్శించింది. వైసీపీ చేస్తున్న వంచనపై గర్జన దీక్షలలో ఇది నాల్గవది నెలకొక జిల్లాలో దీక్ష చొప్పున మొత్తం 13 జిల్లాల్లోనూ ఇదే తీరున దీక్షలు చేపడతామని వైసీపీ చెబుతోంది.

English Title
Chandrababu Cheats AP, We Raised Voice For Special Status - YCP

MORE FROM AUTHOR

RELATED ARTICLES