ఏపి లో కింగ్ ఎవరో నిర్ణయించేది పవన్ కళ్యాణేనా ?

ఏపి లో కింగ్ ఎవరో నిర్ణయించేది పవన్ కళ్యాణేనా ?
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసి ఫలితాలకు రెడీ అవుతున్నాయి . ఏపీకి వరుసగా రెండోసారి చంద్రబాబు మాత్రమే ముఖ్యమంత్రి అవుతారని తెలుగు తమ్ముళ్ళు భావిస్తుంటే...

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసి ఫలితాలకు రెడీ అవుతున్నాయి . ఏపీకి వరుసగా రెండోసారి చంద్రబాబు మాత్రమే ముఖ్యమంత్రి అవుతారని తెలుగు తమ్ముళ్ళు భావిస్తుంటే లేదు లేదు జగన్ మొదటిసారిగా అత్యధిక మేజరిటితో సీఎం అవుతారని వైసీపీ నేతలు అనుకుంటునారు . ఇప్పుడు వీరు ఎవరు కాదు. పవన్ కళ్యాణ్ మాత్రమే ఏపీ సీఎం ఎవరో డిసైడ్ చేసేదని జన సైనికులు చెబుతున్నారు .

ఏపీ ఎన్నికల ఫలితాలు ఎవరిని కింగ్ ల నిలబెట్టలేవని మే 23 న పవన్ కళ్యాణ్ లేకుండా ఎవరు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని జన సైనికులు చెబుతున్నారు . ఏపీ ఎన్నికలు వైసీపీ మరియు టిడిపి మధ్య పేస్ టు పేస్ జరిగాయి అన్న వాదనని కూడా జనసైనికులు ఒప్పుకోవడం లేదట .. జనసేన ఇరువై నుండి ముప్పై స్థానల్లో జెండా ఎగరేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు .

గాజువాక మరియు భీమవరంలో పవన్ గెలుస్తాడని ఇటు ఫాన్స్ అటు క్యాడర్ బలంగా నమ్ముతున్నారు . ఉభయగోదావరి జిల్లాలు మాత్రమే కాకుండా మరికొన్ని జిల్లాల్లో కూడా జనసేన బోణి చేయబోతుందని అ పార్టీ వర్గాలు అనుకుంటున్నాయట. దీనితో పవన్ కళ్యాణ్ మద్దుతు ఇచ్చిన పార్టీనే అధికారం లోకి వస్తుందన్న చర్చ జోరుగా సాగుతుంది .

ఇక అంతే కాకుండా అన్ని అనుకున్నట్టు కుదిరితే పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ మాత్రమే కాదు కింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చర్చ సాగుతుంది . కర్ణాటకలో కుమారస్వామి ఎలాగైతే సిఎం అయ్యారో పవన్ కూడా అవొచ్చని కర్ణాటకని ఉదాహరణగా చూపిస్తున్నారట జన సైనికులు..

Show Full Article
Print Article
Next Story
More Stories