ఆ హీరోని ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా: రష్మిక

Submitted by arun on Wed, 01/31/2018 - 11:34
rashmika mandanna

టాలీవుడ్ యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ఛలో'. ఐరా క్రియేషన్స్‌ పతాకంపై శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో వెంకీ కుడుముల దర్శకత్వంలో ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ద్వారా కన్నడ హీరోయిన్ రష్మిక తెలుగు తెరకు పరిచయం అవుతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా రష్మిక మంగళవారం మీడియాతో ముచ్చటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక సినిమా గురించే కాకుండా.. తన పర్సనల్ విషయాల గురించి కూడా మాట్లాడింది.
 
ఫస్ట్ తను కన్నడ సినిమా కిరిక్ పార్టీలో నటించానని.. తన తర్వాతి సిినిమా అంజనీపుత్ర అని రష్మిక తెలిపింది. ఈ సినిమాలు చూసిన వెంకీ కుడుముల తనకు ఛలో సినిమాలో నటించే అవకాశం కల్పించారని పేర్కొంది. అయితే ‘కిరిక్ పార్టీ’ హీరో అయిన రక్షిత్ శెట్టితో తాను ప్రేమలో ఉన్నానని.. ఆ సినిమా సమయంలో తమ ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని రష్మిక వెల్లడించింది. మనసులు కలిశాయి. పెద్దలతో మాట్లాడి, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు రష్మిక తెలిపింది.

English Title
chalo movie actress rashmika mandanna interview

MORE FROM AUTHOR

RELATED ARTICLES