వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. టీడీపీలోకి కీలక నేత

Submitted by arun on Wed, 09/12/2018 - 10:46
Chalamalasetty Sunil

వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డికి కాకినాడ నేత చెలమలశెట్టి సునీల్ షాకిచ్చారు. ప్రస్తుతం కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేశారు. అక్టోబరు రెండో తేదీన చెలమలశెట్టి సునీల్‌ టీడీపీలోకి చేరుతున్నారని తెలిసింది. ఆయనను వైసీపీ కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి బాధ్యతల నుంచి ఆ పార్టీ అధిష్ఠానం తప్పించినట్టు సమాచారం. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసిన సునీల్,  టీడీపీలో చేరిక అంశాన్ని బాబు వద్ద సునీల్‌ ప్రస్తావించారని, ఆ మేరకు అక్టోబరు 2న సీఎం చంద్రబాబు సమక్షంలో అమరావతిలో పార్టీలోకి చేరనున్నారని చెబుతున్నారు. అయితే ఎన్నికలు దగ్గరపడుతుండగా.. టీడీపీలోకి వలసలు పెరుగుతున్న విషయం తెలిసిందే.

English Title
chalamalasetty sunil may join in tdp

MORE FROM AUTHOR

RELATED ARTICLES