ప్రధాని మోడీ ఎదుట కుండ బద్ధలు కొట్టిన ఏపీ సీఎం చంద్రబాబు

Submitted by arun on Mon, 06/18/2018 - 10:18
babu

దేశంలో చారిత్రక మార్పునకు నీతిఆయోగ్‌ వేదిక అవుతుందన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ముఖ్యమంత్రులు ఇచ్చిన సూచనలు, సలహాలు భవిష్యత్ విధాన నిర్ణయాల్లో పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రాలు సూచించిన అంశాలపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని నీతి ఆయోగ్‌కు ఆదేశించారు. 115 జిల్లాల్లో 45వేల గ్రామాలకు ఏడు కీలక పథకాలను 2018 ఆగస్టు 15 కల్లా చేర్చడానికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. అయితే, ఈ సమావేశం ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగంతో వేడెక్కింది. ఆయన తనకిచ్చిన సమయం మించి మరీ  ప్రధాని మోడీ ఎదుట..తాను చెప్పాల్సింది చెప్పేశారు. 

2017-18 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వృద్ధిరేటు 7.7గా ఉందని.. దీన్ని రెండంకెల స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వం ముందున్న లక్ష్యమని చెప్పారు ప్రధాని నరేంద్రమోడీ. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన నీతిఅయోగ్ సమావేశంలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. 2022 నాటికి సరికొత్త భారతాన్ని నిర్మించాలన్నారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ పథకాలు, వాటి నుంచి ప్రజలు లబ్ధిపొందుతున్న తీరును ప్రధాని వివరించారు.

అయితే, ఈ సమావేశంలో ప్రధాని మోడీ ఎదుట కుండ బద్ధలు కొట్టారు ఏపీ సీఎం చంద్రబాబు. నీతి అయోగ్ సమావేశం ప్రారంభంలోనే తాను చెప్పాల్సింది చెప్పేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తెల్చిచెప్పారు. సమావేశం ప్రారంభమయ్యాక చంద్రబాబు 13 పేజీల ప్రసంగాన్ని 20 నిముషాలపాటు ప్రస్తావించారు. నీతిఅయోగ్ అంశాలపై ప్రస్తావనకు ముందే ఏపీ విభజన హామీల అమలులో కేంద్రం తీరును ఎండగట్టారు.  

అయితే, ముఖ్యమంత్రులకు 7 నిముషాల సమయం కేటాయించినప్పటికీ... ఏపీ ప్రత్యేక రాష్ట్రమని, విభజన జరిగిన తర్వాత ఏపీని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని, కాబట్టి తన స్పీచ్‌ను ప్రత్యేకంగా చూడాలంటూ సుమారు 20 నిముసాల పాటు చంద్రబాబు ప్రసంగించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ తదితర వాటిపై ఆయన ప్రసంగించారు.  

వెనుకబడిన 7 జిల్లాలకు ఇస్తున్న నిధులు చాలా తక్కువగా ఉన్నాయని, ఎక్కువ చేయాలని కోరారు చంద్రబాబు. రెవెన్యూ లోటును భర్తీ చేయాలన్నారు. విద్యాసంస్థలకు ఇవ్వాల్సిన నిధులు త్వరగా విడుదల చేస్తే వాటి నిర్మాణాలు పూర్తి అవుతాయని  పేర్కొన్నారు. రైల్వే జోన్, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, సీట్ల పెంపు తదితర విషయాలను కూడా ఈ సందర్బంగా చంద్రబాబు ప్రస్తావించారు. 

నిధుల పంపిణీలో కేంద్రం వివక్ష చూపుతోందని, పెద్ద నోట్ల రద్దు ప్రభావం దేశమంతటా వ్యాపించిందని, చిరు వ్యాపారులు, రైతులు ఏటీఎంలలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీలైన రాజ్‌నాథ్ సింగ్ సమయాభావం వల్ల ప్రసంగాన్ని ముగించాల్సింగా కోరారు. అయినా అదేమీ సీఎం పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు.  

English Title
Centre should give macro strategy, not micromanage Schemes: N Chandrababu Naidu

MORE FROM AUTHOR

RELATED ARTICLES