ఏపీకి భారీ షాక్ ఇచ్చిన కేంద్రం..

Submitted by nanireddy on Sun, 07/29/2018 - 09:20
central-govt-shak-to-andhrapradesh

కేంద్ర ప్రభుత్వం ఏపీకి మరోసారి  భారీషాక్ ఇచ్చింది.. ప్రత్యేక హోదా కోసం ఉద్యమం జరుగుతున్న వేళ.. ఏపీకి హోదా ఇవ్వలేం అని పార్లమెంట్ సాక్షిగా హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ప్రకటించారు. అయితే అంతో ఇంతో వస్తుందని ఆశలు పెట్టుకున్న ప్రత్యేక రైల్వే జోన్ కూడా ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే విజయవాడకు మెట్రో రైల్ కూడా ఇవ్వలేమని చెప్పకనే చెప్పింది. విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టు ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో 10వ షెడ్యూల్ ఆస్తులను పంచాల్సిన అవసరం లేదని అఫిడవిట్లో తెలిపింది. దాని ప్రకారం ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. 

ఇటీవలే రాజ్యసభలో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చలో విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్. అయితే రాజ్ నాథ్ సింగ్ ప్రకటనకు భిన్నంగా  సుప్రీంకు కేంద్ర అఫిడవిట్ సమర్పించింది. ఇప్పటికే 16 జోన్లు ఉన్నందున కొత్త జోన్ ఏర్పాటు అంత మేలు చేకుర్చదనే అభిప్రాయం రైల్వే శాఖ వెలియబుచ్చిందని అఫిడవిట్‌లో పేర్కోంది.

ఇక విజయవాడ మెట్రో సాధ్యం కాదని చెప్పకనే చెప్పింది. నూతన మెట్రో పాలసీకి అనుగుణంగా ఉంటేనే విజయవాడకు మెట్రో ఇస్తామని తెలిపింది. అమరావతి నిర్మాణం కోసం 15 వేల కోట్లకు యూసీ ఇచ్చారంటూ అఫిడవిట్ ఇచ్చింది. అలాగే ఏపీలో అనేక సంస్థల ఏర్పాటుకు ఇంకా డీపీఆర్ తయారీకాలేదని.. తద్వారా  అవి ఇంకా ఆమోదం దశలోనే ఉన్నాయని అంగీకరించింది. ఇక తాజా పరిణామంపై టిడిపి, వైసీపీ నేతలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

English Title
central-govt-shak-to-andhrapradesh

MORE FROM AUTHOR

RELATED ARTICLES