సీబీఐపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్పందించిన మాజీ జేడీ

Submitted by nanireddy on Fri, 11/16/2018 - 18:38
cbi ex jd lakshminarayana responds on ap govt cbi issue

ప్రభుత్వ అనుమతి లేనిదే  ఏపీలో సీబీఐ దర్యాప్తు చేయకూదదని చంద్రబాబు ప్రభత్వం జీవో జారీచేసింది.అయితే ప్రభుతం తీసుకున్న నిర్ణయాన్ని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తప్పుబట్టారు. సీబీఐకి ఇచ్చిన అనుమతిని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, కానీ ఎందుకు రద్దు చేశారో చెప్పాలని అన్నారు. సీబీఐ సంస్థపై ఆరోపణలు వస్తే ఆ సంస్థనే దర్యాప్తు చేయవద్దనడం సరికాదన్నారు. ఈ నిర్ణయం వల్ల అవినీతికి పాల్పడే వారు మరింత రెచ్చిపోతారని తెలిపారు. ప్రతి కేసు విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్లాలంటే కుదరదని.. ఇది సీబీఐకి ప్రతిబంధకమని ఆయన అభిప్రాయపడ్డారు. 

English Title
cbi ex jd lakshminarayana responds on ap govt cbi issue

MORE FROM AUTHOR

RELATED ARTICLES