శవాన్ని పీక్కుతున్న పిల్లి.. ప్రభుత్వ ఆస్పత్రి వైనం

శవాన్ని పీక్కుతున్న పిల్లి.. ప్రభుత్వ ఆస్పత్రి వైనం
x
Highlights

ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే ప్రజలు హడలిపోతారు. డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటారన్న భావన స్థిరపడిపోయింది. ఇలాంటి ఘటనే కోయంబత్తూర్ జిల్లా సర్కారు...

ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే ప్రజలు హడలిపోతారు. డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటారన్న భావన స్థిరపడిపోయింది. ఇలాంటి ఘటనే కోయంబత్తూర్ జిల్లా సర్కారు ఆసుపత్రిలో చోటుచేసుకుంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని మహిళా వార్డులో ఒక మహిళా రోగి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో చనిపోయింది. చనిపోయిన మహిళ వివారాలు తెలియకపోవడంతో వార్డులోనే శవాన్ని పక్కకు పెట్టారు. శవాన్ని శవపరి‍‍క్షకు పంపకుండా కటిక నెలపై ఎమీ తెలియనట్లుగా మూలన పడెసారు. కాగా ఆసుపత్రి ప్రగంణ పరిసరాల్లో ఉండే పిల్లి శవాన్ని గమనించి ఇక శావాన్ని పిక్కతినడం మొదలు పెట్టింది. పక్కన ఉన్న వాళ్లు సిబ్బందికి తెలిపిన బేఖాతార్ చేశారు అధికారులు. దింతో ఆగ్రహించిన మిగత రోగులు శవం ముందు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని దుయ్యబడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒక్కసారిగా ఆసుపత్రి ప్రాంగణం దద్దరిల్లడంతో సిబ్బంది శవాన్ని మార్చురీకి తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రి నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తున్నాయని ప్రజలు అంటున్నారు. ప్రభుత్వ వెంటన స్పందిస్తూ ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories