అగ్రవర్ణాలకే ప్రాధాన్యమిచ్చిన రాజకీయ పార్టీలు

అగ్రవర్ణాలకే ప్రాధాన్యమిచ్చిన రాజకీయ పార్టీలు
x
Highlights

రాజకీయ పార్టీలన్నీ అగ్రవర్ణాలకే ప్రాధాన్యమిచ్చాయని ఇప్పటివరకు జరిగిన టికెట్ల కేటాయింపు లెక్కలు చెపుతున్నాయి. ఒక్క బహుజన లెఫ్ట్‌ పార్టీ, సీపీఎం కూటమి...

రాజకీయ పార్టీలన్నీ అగ్రవర్ణాలకే ప్రాధాన్యమిచ్చాయని ఇప్పటివరకు జరిగిన టికెట్ల కేటాయింపు లెక్కలు చెపుతున్నాయి. ఒక్క బహుజన లెఫ్ట్‌ పార్టీ, సీపీఎం కూటమి బీఎల్‌ఎఫ్‌ మినహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తాము ప్రకటించిన స్థానాల్లో అత్యధికం ఓసీలకే ఇచ్చాయి. అధికార టీఆర్‌ఎస్‌ 119 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా, అందులో 58 అగ్రవర్ణాలకు కేటాయించారు. ఇక, మహాకూటమి పక్షాన ప్రకటించిన 118 స్థానాల్లో 49 సీట్లు ఓసీలకు ఇచ్చారు. బీజేపీ కూడా 118 స్థానాల్లో 46 ఓసీలకే కేటాయించింది.

బీఎల్‌ఎఫ్‌ మాత్రం 118 స్థానాల్లో ఆరు చోట్ల మాత్రమే ఓసీలకు అవకాశం ఇచ్చింది. ఇక, బీసీల విషయానికి వస్తే టీఆర్‌ఎస్‌ మొత్తం 26 స్థానాలు ఇవ్వగా, ఇప్పటివరకు ప్రకటించిన వాటిలో కూటమి 26 స్థానాలను కేటాయించింది. బీజేపీ 38 స్థానాలు బీసీలకివ్వగా, బీఎల్‌ఎఫ్‌ 59 చోట్ల బీసీలను నిలబెట్టింది. ఎస్సీ, ఎస్టీలకు అన్ని పార్టీలు రిజర్వుడు స్థానాల్లో ఎస్సీ–19, ఎస్టీ–12 చొప్పున కేటాయించగా, కాంగ్రెస్‌ మాత్రం ఒక జనరల్‌ సీటును అదనంగా ఎస్సీకి కేటాయించింది. బీఎల్‌ఎఫ్‌ మాత్రం రిజర్వేషన్‌ కంటే ఎక్కువగా 28 ఎస్సీలకు, 15 ఎస్టీలకు ఇచ్చింది.

మైనార్టీల విషయంలో కూటమి నుంచి 8 మంది, టీఆర్‌ఎస్‌ నుంచి నలుగురు, బీజేపీ నుంచి ఇద్దరు, బీఎల్‌ఎఫ్‌ నుంచి 10 మంది బరిలో ఉండనున్నారు. మొత్తంమీద అన్ని పార్టీలు కలిపి 24 మంది మైనార్టీలకు పోటీచేసే అవకాశం కల్పించారు. కులాల వారీగా పార్టీల అభ్యర్థులను పరిశీలిస్తే..టీఆర్‌ఎస్‌ ప్రకటించిన మొత్తం 119 సీట్లలో రెడ్డి -37, వెలమ -12, కమ్మ - 6, బ్రాహ్మణ - 1, వైశ్య - 1, ఠాకూర్ -1, మున్నూరు కాపు- 8, గౌడ - 6, యాదవ - 6, ముదిరాజ్ -1, గంగపుత్ర - 1, పద్మశాలి - 1, విశ్వబ్రాహ్మణ - 1, పెరిక - 1, పంజర- 1, మాదిగ - 11, మాల - 7, నేతకాని - 1, లంబాడ- 7, కోయ - 4, ఆదివాసీ - 1, ముస్లీం - 3, సిక్కు -1 చొప్పున కేటాయించారు.

ఇక కాంగ్రెస్ పార్టీలో ముందుగా ప్రకటించిన 94 సీట్ల కంటే అదనంగా 5చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 99 స్థానాల్లో కులాల వారీగా చూస్తే.. రెడ్డి -36, మాదిగ-9, మాల- 8, మున్నూరు కాపు-8, ముస్లీం-7, ఆదివాసులు- 5, లంబాడ- 5, గౌడ-5, వెలమ-4, పద్మశాలి-2, యాదవ-2, బొందిలి-1, బ్రాహ్మణ- 1, బట్రాజు-1, విశ్వబ్రాహ్మణ-1, నేతకాని-1, ముదిరాజ్-2, షెట్కార్-1 చొప్పున కేటాయించారు.

టీడీపీలో 14 స్థానాల్లో బరిలో దిగిన అభ్యర్థులను పరిశీలిస్తే.. రెడ్డి-3, కమ్మ-3, గౌడ-3, ముదిరాజ్-1, వైశ్య-1, ఎస్సీ-1, ఎస్టీ-1, ముస్లీం-1 చొప్పున అభ్యర్థులకు టిక్కెట్టు కేటాయించారు. మరోవైపు టీజేఎస్‌లో 9 మంది బరిలో ఉండగా.. రెడ్డి-5, ఎస్సీ-1, బ్రాహ్మణ-1, మున్నూరు కాపు-1, ముదిరాజ్‌-1 చొప్పున ఇచ్చారు. అలాగే, సీపీఐ తరఫున ముగ్గురు అభ్యర్థులు ఉంటే ఒకటి రెడ్డి, ఒకటి ఎస్సీ, ఒకటి ఎస్టీకి కేటాయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories