అజ్ఞాతవాసిపై కేసు న‌మోదు

అజ్ఞాతవాసిపై కేసు న‌మోదు
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో అజ్ఞాతవాసి సినిమా సంద‌డి మొద‌లైంది. ఇప్ప‌టికే దుబాయ్ రివ్యూతో సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో తెలిసిపోయింది. అయితే ఆ సినిమా...


తెలుగు రాష్ట్రాల్లో అజ్ఞాతవాసి సినిమా సంద‌డి మొద‌లైంది. ఇప్ప‌టికే దుబాయ్ రివ్యూతో సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో తెలిసిపోయింది. అయితే ఆ సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉన్నా వివాదాలు చుట్టుముడుతున్నాయి. కొద్దిరోజులుగా సినిమా కాపీరైట్స్ విష‌యం ఎన్ని మ‌లుపులు తిరిగిందో మ‌న‌కు తెలిసిందే. ప్రెంచ్ సినిమా కాపీ కొట్టారంటూ ఆ సినిమా నిర్మాణ సంస్థ టీసిరీస్ తెలుగు అజ్ఞాతవాసి చిత్ర యూనిట్ కు నోటీసులు పంపింది. దీంతో న‌యానోబ‌యానో చెల్లించి ఆ వివాదం స‌ద్దుమ‌ణిగేలా చూసుకున్నారు నిర్మాత‌. అయితే ఈ సినిమాలో ప‌వ‌న్ ‘కొడకా కోటేశ్వరరావు ఖర్సైపోతవురో… నువ్వు పులుసైపోతవురో…’ అంటూ పవన్ పాడారు. ఆపాట వ‌ల్ల త‌మ మ‌నోభావాలు తింటున్నాయ‌ని కోటేశ్వరరావు అనే న్యాయవాది పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీంతో ఈ సినిమాపై కేసు న‌మోదు అయ్యింది. మా మ‌నోభావాలు దెబ్బ‌తిన‌కుండా ఉండాలంటే పాటలోని కోటేశ్వరరావు అన్న పేరును తొల‌గించాల‌ని స‌ద‌రు పిటిష‌నర్ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories