పెట్రోల్ బంక్‌లోకి దూసుకొచ్చిన కారు..

పెట్రోల్ బంక్‌లోకి దూసుకొచ్చిన కారు..
x
Highlights

గుజరాత్‌ రాజ్‌కోట్‌‌లో ఓ కారు అలజడి రేపింది. రాజ్‌కోట్‌ కలవాడ్‌ రోడ్‌లోని ఓ పెట్రోల్‌ బంకులోకి దూసుకొచ్చిన కారు.... బీభత్సం సృష్టించింది. కారు...

గుజరాత్‌ రాజ్‌కోట్‌‌లో ఓ కారు అలజడి రేపింది. రాజ్‌కోట్‌ కలవాడ్‌ రోడ్‌లోని ఓ పెట్రోల్‌ బంకులోకి దూసుకొచ్చిన కారు.... బీభత్సం సృష్టించింది. కారు స్పీడ్‌కి పెట్రోల్‌ పంప్‌... మొత్తం ఊడిపడింది. ఇక అక్కడే ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పెట్రోల్ డిస్పెన్షర్‌తో పాటు ఓ ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories