ఏబిసిడి మొదటి రోజు కలెక్షన్లు

ఏబిసిడి మొదటి రోజు కలెక్షన్లు
x
Highlights

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న అల్లు శిరీష్ 'ఒక్క క్షణం' సినిమా తో మరొక డిజాస్టర్ ను అందుకున్నాడు. తాజాగా మలయాళంలో సూపర్ హిట్ అయిన 'ఏబీసీడీ' సినిమా...

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న అల్లు శిరీష్ 'ఒక్క క్షణం' సినిమా తో మరొక డిజాస్టర్ ను అందుకున్నాడు. తాజాగా మలయాళంలో సూపర్ హిట్ అయిన 'ఏబీసీడీ' సినిమా తెలుగు రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ యువ హీరో. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా లో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటించింది. విడుదలకు ముందు నుంచి ప్రేక్షకుల అంచనాలను పెంచిన ఈ చిత్రం తాజాగా మే 17న విడుదలైంది. ఓపెనింగ్ డే రోజు నుంచే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ ను అందుకుంటోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏబిసిడి చిత్రం 2.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసుకుంది. సినిమా టాక్ బాగానే ఉండటంతో వారాంతంలో ఈ సినిమా కలెక్షన్లు మెరుగుపడతాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మధుర శ్రీధర్ రెడ్డి మరియు యశ్ రంగినేని నిర్మించిన ఈ చిత్రానికి జివి రమణ సంగీతాన్ని అందించారు. అల్లు శిరీష్ తండ్రి పాత్రలో నాగబాబు కనిపించగా ఫ్రెండ్ పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ భరత్ కనిపించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories