ముగిసిన ఏడో విడత పోలింగ్‌

ముగిసిన ఏడో విడత పోలింగ్‌
x
Highlights

సార్వత్రిక ఎన్నికల్లో తుది విడత పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6గంటల వరకు మొత్తం 60.20 శాతం పోలింగ్‌ నమోదైంది. బీహార్‌లో 49.92, హిమాచల్‌ ప్రదేశ్‌లో65.68,...

సార్వత్రిక ఎన్నికల్లో తుది విడత పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6గంటల వరకు మొత్తం 60.20 శాతం పోలింగ్‌ నమోదైంది. బీహార్‌లో 49.92, హిమాచల్‌ ప్రదేశ్‌లో65.68, మధ్య ప్రదేశ్‌లో 69.38, పంజాబ్‌లో 58.781, ఉత్తర్‌ ప్రదేశ్‌లో 54.13, పశ్చిమ బెంగాల్‌లో 73.05, జార్ఖండ్‌లో 70.05, చండీగఢ్‌లో 63.57 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది.

దేశంలో ఇప్పటికే 484 నియోజక వర్గాల్లో పోలింగ్‌ పూర్తి కాగా.. మిగతా 59 నియోజకవర్గాలకు పోలింగ్‌ తుది విడతలో జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని 13, పంజాబ్‌లో 13, పశ్చిమ బెంగాల్‌లో 9, బిహార్‌, మధ్యప్రదేశ్‌లో చెరో 8 స్థానాలతో పాటు హిమాచల్‌ ప్రదేశ్‌లో 4, జార్ఖండ్‌లో 3, చండీగఢ్‌లో ఒక స్థానానికి చివరి విడతలో పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 59 స్థానాలకు గాను 918 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories