వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులకు ప్రభుత్వం వరాలజల్లు

Submitted by arun on Sun, 09/02/2018 - 15:17

వైద్యారోగ్యశాఖ సిబ్బంది పైనా వరాలు కురిపించింది తెలంగాణ సర్కార్. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రి వర్గ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలుకీలక అంశాలపై చర్చలు జరిపినట్లు తెలియవచ్చింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో రెండు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 27,045 మంది  ఆశా వర్కర్ల గౌరవేతనాన్ని 6వేల నుంచి 7,500కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు. ఎన్నోఏళ్లుగా అతితక్కువ వేతనానికి పనిచేస్తున్న 9వేల మంది ఏఎన్‌ఎంలు, స్టాఫ్ నర్సులు, ఎన్‌యూహెచ్‌లకు కనీస వేతనాలు అమలు చేసేలా 11 వేల నుంచి 21వేలకు పెంచినట్టు తెలిపారు. అలాగే, అర్బన్‌లో కాంట్రాక్టు విధానంలో పనిచేసే డాక్టర్లు, సిబ్బంది వేతనాలు కూడా పెంచినట్టు హరీశ్‌రావు చెప్పారు. 

English Title
Cabinet meet ends; salary hike for ASHA workers

MORE FROM AUTHOR

RELATED ARTICLES