‘తలాక్‌’ను నిషేధిస్తూ ఆర్డినెన్స్‌

Submitted by nanireddy on Thu, 09/20/2018 - 07:39
cabinet-approves-ordinance-criminalise-triple-talaq

ముస్లిం మహిళలకు వారి భర్తలు తక్షణమే విడాకులు ఇచ్చే ట్రిపుల్‌ తలాక్‌ పద్ధతిని నేరంగా పరిగణించే ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈమేరకు ఆర్డినెన్స్‌కు బుధవారం కేంద్ర మంత్రిమండలి ఆమోదించిందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలియజేశారు.  ట్రిపుల్‌ తలాక్‌ చెప్పడం శిక్షార్హం అవుతుంది. ట్రిపుల్ తలాక్ కు పాల్పడే వారికీ మూడేళ్ల వరకు జైలు శిక్షను ప్రతిపాదిస్తూ కేంద్ర కేబినెట్ నిబంధనలు చేర్చింది. ఈట్రిపుల్‌ తలాక్‌ను సుప్రీంకోర్టు కొట్టేసిన తరువాత కూడా ఆ కేసులు నమోదవుతున్నాయని మంత్రి రవిశంకర్‌ వెల్లడించారు. అయితే ఈ చట్టం దుర్వినియోగం కాకుండా..విచారణకు ముందే నిందితులకు బెయిల్‌ మంజూరుచేసే వెసులుబాటును ఇందులో చేర్చినట్టు అయన పేర్కొన్నారు. ఇప్పటికే ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. రాజ్యసభలో కూడా ఆమోదం పొందాల్సి ఉంది. రాజ్యసభలో గనుక  ఆమోదం పొందితే ఇక ఈ చట్టం చారిత్రకమే అవుతుంది. 

English Title
cabinet-approves-ordinance-criminalise-triple-talaq

MORE FROM AUTHOR

RELATED ARTICLES