ఉప ఎన్నికల ఫలితాల అప్‌డేట్స్‌ : బీజేపీకి ఎదురుదెబ్బ

ఉప ఎన్నికల ఫలితాల అప్‌డేట్స్‌ : బీజేపీకి ఎదురుదెబ్బ
x
Highlights

ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. 4 లోక్ సభ, 11 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కౌంటింగ్ తుది దశకు చేరుకుంది. ఇప్పటి వరకు...

ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. 4 లోక్ సభ, 11 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కౌంటింగ్ తుది దశకు చేరుకుంది. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించిన ఫలితాలను బట్టి కాంగ్రెస్ రెండు చోట్ల విజయం సాధించింది. కర్ణాటకలో రాజరాజేశ్వరి నగర్ తో పాటు మేఘాలయలో అంపటి స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. 3191 ఓట్ల మెజార్టీలో ప్రత్యర్ధిపై విజయం సాధించాడు. పంజాబ్ లో షాకోట్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అదే విధంగా జార్ఖండ్ లోని రెండు స్థానాల్లోను జెఎంఎం ముందంజలో ఉంది.

ఉత్తరప్రదేశ్ లో కీలకంగా భావించిన కైరానా నియోజకవర్గంలో ఆర్‌ఎల్డీ ముందంజలో ఉండగా, మహారాష్ట్రలోని పాల్ఘడ్‌లో విజయం బీజేపీని దోబుచులాడుతోంది. భండారా గోండియా నియోజక వర్గంలో బిజెపి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక నాగాలాండ్ లోక్ సభ స్థానంలో ఎన్.డి.పి.పి ఆధిక్యంలో కొనసాగుతోంది. కైరానా నియోజక వర్గంలో బిజెపికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం అయ్యాయి. రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీకి చెందిన తబస్సుమ్ హసన్, బిజెపి అభ్యర్ధి మృగాంక సింగ్ కన్నా ముందంజలో కొనసాగుతున్నారు. విజయం వైపు దూసుకుపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories