logo

ఆన్‌లైన్‌ అంత్యక్రియలు

ఆన్‌లైన్ షాపింగ్‌.. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట.. మారుతున్న కాలంతో పాటు వ్యాపారం తీరు మారటం.. తీరిక లేని జీవనశైలీ.. పెరుగుతున్న నెట్ వ్యాపారం.. ఒక్క క్లిక్‌తో ఇంటి నుంచే షాపింగ్‌ చేసే అవకాశం ఇస్తుంది ఆన్‌లైన్‌ బిజినెస్‌. సమయం కూడా కలిసిరావటం.. శ్రమ తగ్గటంతో ఆన్‌లైన్‌ షాపింగ్‌పై ఆసక్తి పెరుగుతోంది. ఇప్పుడు ఇదే జాబితాలో చేరింది అంత్యక్రియల కిట్‌. ఆశ్చర్యంగా ఉంది కదూ!... అమెజాన్‌ అందించే ఆ ఆఫర్‌ మీరూ చూడండి.

ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌, అమేజాన్‌ ఇప్పుడు ఇంటింటా మోగుతున్న ఈ కామర్స్‌ కంపెనీలు. అత్యల్ప కాలంలోనే ఈ రెండు కంపెనీల వాల్యుయేషన్‌ ఊహించనంత మేర పెరిగిపోయింది. దీన్నే క్యాష్‌ చేసుకున్న అమేజాన్‌ అనూహ్యంగా ఓ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. అదే ఫైనల్‌ రైట్స్‌ కిట్‌.

ఇప్పుడు ఏదైనా గూగుల్‌ వెంట పడాల్సిందే. వస్తువైనా పదార్థమైనా చివరకు ఓ సందేశమైనా ఇలా ఏదైనా గూగుల్‌లో వెతాకాల్సిందే. ఆవు పిడకల నుంచి గొబ్బెమ్మల దాకా, అటుకుల నుంచి గోమూత్రం దాకా అన్నీ ఆన్‌లైన్‌లో ఆర్డరిస్తున్న జనాల పిచ్చిని అమేజాన్‌ ఎంచక్కా తలకెక్కించుకున్నట్టుంది. ఏకంగా అంత్యక్రియల కోసం ఎక్కడెక్కడో తిరిగి వస్తువులు సంపాదించే వీలు లేకుండా సర్వ పూజా కిట్‌ అంటూ మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసింది.

మనిషి చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు అవసరమైన సంప్రదాయ సామగ్రిని ఎక్కడెక్కడో కోనే అవసరం లేకుండా అన్నీ ఒకేచోట చేర్చి అమ్మేస్తోంది అమేజాన్‌. మరి ప్యాక్‌ను ప్లేస్‌ చేశాక అది వచ్చే వరకూ శవాన్ని ఇంట్లోనే ఉంచాలా? అంటే అబ్బే అవసరం లేదంటోంది అమేజాన్‌.

అంత్యక్రియలకు ఏమేం కావాలో అన్నింటని ఒక చోట ప్యాక్‌ చేసి హోమ్‌ డెలివరీ చేసేస్తోంది అమేజాన్‌. సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలకు ఎలాంటి లోటు లేకుండా అమేజాన్‌ కిట్‌లో సరుకులను ఇంటికి పంపిచేస్తోంది అమేజాన్‌. అంత్యక్రియల కోసం ఏమేం కావాలో అన్నీ అందిస్తోంది అమేజాన్‌. అంత్యక్రియల తంతు దగ్గర వాడే ఆవు పేడ, బ్లేడు, అగ్గిపెట్టె, వక్కలు, నల్ల నువ్వులు, పేలాలు, దారం, శెల్ల, దండ దగ్గర నుంచి చిన్న కుండలు, అగరుబత్తీలు, విభూతి, గోమూత్రం, గంగాజలం అన్నీ అందులో ఉంటాయ్‌. టోటల్‌ ప్యాక్‌ రేట్‌ జస్ట్‌ TWO THOUSAND NINE FIFTY REPEES.

పల్లెటూళ్లో అంత్యక్రియలకు ఏం కావాలో అన్నీ దొరుకుతాయ్. పెద్ద పెద్ద నగరాల్లో కూడా వీటికి లోటుండదు. ఇలాంటి దుకాణాలు ఉన్నా అందులో అన్ని సరుకులు దొరుకవు. తప్పనిసరిగా ఆ తంతుకు అన్నీ కావాలి. ఆ సమయంలో అన్ని దొరకాలంటే కష్టమే కావచ్చు. తిరిగే ఓపికా లేకపోవచ్చు అందుకే అమేజాన్‌ ఇలాంటి ఛాన్స్‌ను దక్కించుకుంది. ఇది సరే ఫైనల్‌ రైట్స్‌ను ఆ ప్యాక్‌ వచ్చే వరకూ అలాగే ఉంచాలా? అంటే అవసరం లేదంటోంది అమేజాన్‌. ఉన్నదాంట్లో స్పీడ్‌ డెలివరీ ఆప్షన్‌ను కూడా ఇచ్చింది.

ఇప్పుడన్నీ ఆన్‌లైన్‌లోనే. కూచున్న చోట నుంచి సరుకులైనా వస్తువులైనా సింగిల్‌ క్లిక్‌తో ఇంటికి వచ్చి పడుతాయ్‌. అందకే ఈ షాపింగ్‌పై ఈతరమంతా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అందుకే ఆన్‌లైన్‌ బిజినెస్‌ దిగ్గజాలు కోట్లకు పడగలెత్తుతున్నాయ్.

ఆన్‌లైన్ మార్కెట్ హల్‌చల్ చేస్తున్న రోజులవి. ఇప్పుడు ఏ వస్తువు కావాలన్నా.. జనం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్నారు. పండగ ఏదైనా.. విక్రయశాలలకు దీటుగా ఆన్‌లైన్‌ పోర్టళ్ల హడావుడి పెరిగింది. సూపర్ మార్కెట్లేమో ఒకదానితో మరొకటి పోటీపడలేక కుదేలవుతున్నాయి. ఎక్కువ స్టోర్లతో పాటు నష్టాల్ని తట్టుకునే సామర్థ్యం కూడా ఉంటే తప్ప మనలేకపోతున్నాయి. కానీ అదే ఆన్‌లైన్‌ బిజినెస్‌ మాత్రం భిన్నంగా ఉంది. సరుకుల కొనుగోలుకు సమయం లేకపోవటం వల్ల నగరాల ప్రజలు కూరగాయలు, పప్పు, ఉప్పులాంటి కిరాణా సరుకులకు కూడా ఈ-కామర్స్ సైట్ల వైపు మళ్లుతున్నారు.

ఇవే కాదు ఫర్నిచర్‌ కూడా. ఇంటికి కావల్సిన ఫర్నిచర్‌ కోసం ఎక్కడెక్కడో వెతకటం నాలుగు షాపులు తిరగటం ఎక్కువ చోట చూడటం చివరికి ఎక్కడో ఒక చోట రాజీపడటం చాలామంది చేస్తున్నదిదే ఇప్పుడు అంతలా కష్టపడకుండా మన టేస్టుకు తగ్గట్టుగా ఫర్నీచర్‌ను ఎంచుకునే వెసులుబాటు కల్పించేలా పుట్టుకొచ్చాయి ఆన్‌లైన్‌ ఫర్నీచర్‌ స్టోర్స్.

ఆన్‌లైన్‌ షాపింగ్ కాలు బయటపెట్టకుండా ఇంట్లోనే కూర్చుని కొనుగోలు చేసే ఈజీ వే. ఇప్పటివరకు ఎన్నో వస్తువులు ఆన్‌లైన్‌లో లభిస్తుండగా గొబ్బెమ్మలు, పిడకలు కూడా ఆన్‌లైన్‌ జాబితాలోకి చేరాయి. వీటి వ్యాపారమంతా దేశ విదేశాల్లో ఆన్‌లైన్‌ ద్వారా జరుగుతోంది. మన దేశం నుంచి ఇతర దేశాల్లో స్థిరపడ్డ సంప్రదాయ కుటుంబాలు పిడకలు గొబ్బెమ్మలను వారికి పంపించేందుకు ఆన్‌లైన్‌, గిఫ్ట్‌ పోర్టళ్లను ఆశ్రయిస్తుండటం విశేషం.

లైవ్ టీవి

Share it
Top