తెలంగాణ పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు..రాష్ట్రవ్యాప్తంగా అమలుకు రంగం సిద్ధం

తెలంగాణ పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు..రాష్ట్రవ్యాప్తంగా అమలుకు రంగం సిద్ధం
x
Highlights

నిత్యం పని ఒత్తిడితో,అధికారుల ఒత్తిడితో సతమతం చెందుతూ విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది వారంతపు సెలవులను అమలు చేసేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కార్యాచరణ...

నిత్యం పని ఒత్తిడితో,అధికారుల ఒత్తిడితో సతమతం చెందుతూ విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది వారంతపు సెలవులను అమలు చేసేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కార్యాచరణ మొదలుపెట్టింది. కానిస్టేబుల్ దగ్గరి నుంచి డిసిపి స్థాయి అధికారి వరకు అందరికి ఒకే విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కొన్ని జిల్లాలో వారాంతపు సెలవులు అమలు చేస్తుండగా ఇక నుండి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

పోలీసింగ్ తో రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీస్ సిబ్బందికి వారంతపు సెలవులు అమలు మొదలు పెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది తెలంగాణ పోలీస్ శాఖ. రాష్ట వ్యాప్తంగా కానిస్టేబుల్ దగ్గరి నుంచి డిసిపి స్థాయి వరకు వారాంతపు సెలవులు అమలు చేయాలని ఆదేశాలు విడుదల చేసారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ దాదాపు 55 వేల మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో పోలీస్ శాఖలో మరో 18 వేల మంది సిబ్బంది నియామకాల భర్తీ పూర్తి అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా వారంతపు సెలవుల అమలుకు రంగం సిద్ధం చేస్తోంది.

నిత్యం బందోబస్తులతో విధి నిర్వహాణ కోనసాగించే పోలీసులకు వారాంతపు సెలవులు ప్రకటించాలని గతంలో ప్రతిపాదనలు ఉన్న నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అందుకు సరైనా సిబ్బంది అందుబాటులో ఉండక పోవడంతో వారాంతపు సెలవులపై పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వత పోలీస్ శాఖలో అనేక ఉద్యోగాలు భర్తీ అయిన నేపధ్యంలో ఇప్పుడు కొంత వెసులు బాటు కల్పించడం కోసం ఈ-లీవ్ యాప్ ద్వారా సెలవులు పెట్టుకోవడానికి పోలీస్ శాఖ అమలు చేసింది. ఇక మరోవైపు వారంతపు సెలవుల పై ఇప్పటికే వరంగల్,మహబూబ్ నగర్, సిద్దిపేట లాంటి జిల్లాలో అమలు చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డీజీ కార్యాలయం నుండి అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం.

మొత్తం సిబ్బందిలో ప్రతి 7 మందిలో ఒకరికి చొప్పున ప్రతిరోజూ సెలవు - ఈ విధానం.. జనరల్‌, ట్రాఫిక్‌ డ్యూటీలోని కానిస్టేబుల్స్‌కు వర్తింపచేయవచ్చు. ఈ సెలవుల విధానం కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నారు. ఈ 19 విధానాల్లో ఏదో ఒక విధానాన్ని, ఉద్యోగుల డ్యూటీల వివ‌రాల‌ను స‌ద‌రు పర్యవేక్షణాధికారులు ప్రతి నెలా 25వ తేదీన సాఫ్ట్‌వేర్‌లో పొందుప‌ర‌చాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories