అభిమానులకు సమంత బంపర్ ఆఫర్!

Submitted by hmtvdt on Sun, 04/29/2018 - 23:31
Sam's promotion for mahanati

మహానటి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సమంత.. ఆ మూవీని డిఫరెంట్ గా.. ప్రమోట్ చేసేస్తోంది. మహానటి సావిత్రికి సంబంధించిన అహనా పెళ్లంట పాటలు చూస్తూ.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. మీరు కూడా.. సావిత్రిగారికి సంబంధించిన బెస్ట్ వీడియో కలెక్షన్స్ నాకు పంపించండి.. మంచి బహుమతులు అందుకోండి సమంత ఊరిస్తోంది. సమంత అలా చెప్పగానే.. ఫ్యాన్స్ కూడా ఇలా ఎగ్జయిట్ అవుతూ.. సావిత్రి వీడియోస్ చెక్ చేసేస్తున్నారు.

వెంటనే మహానటి యూనిట్ వాళ్లకో.. సమంత సోషల్ మీడియాలో పేజ్ లోనో వాటిని పోస్ట్ చేసి బహుమతులు కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా.. సమంత తన గడుసుతనాన్ని బాగానే చాటుకుందని చెప్పవచ్చు. చాలా తెలివిగా.. మహానటికి ప్రమోషన్ ఇస్తోందని కూడా అంతా అనుకుంటున్నారు.

రంగస్థలంలో అద్భుత నటనతో శభాష్ అనిపించుకున్న సమంత.. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక చిత్రమైన మహానటితో త్వరలోనే మన ముందుకు వస్తోంది. ఆ లోపు ఇలా సోషల్ మీడియాలో సందడి చేసేస్తోంది.

English Title
Bumper offer from Samantha

MORE FROM AUTHOR

RELATED ARTICLES