ఐకియా స్టోర్‌ : నిన్న వెజ్‌ బిర్యానీ.. నేడు కేక్‌

Submitted by arun on Fri, 09/21/2018 - 14:42
IKEA

వెజ్‌ బిర్యానీలో గొంగళి పురుగు రేపిన కలకలం సద్దుమణగకముందే ఐకియాలో మరో పురుగు బయటకొచ్చింది. ఈ సారి చాక్లెట్‌ కేక్‌లో, అది కూడా బతికున్న పురుగు. కిషోర్‌ అనే కస్టమర్‌ ఈ విషయాన్ని తన ట్విటర్‌ ద్వారా తెలియజేశాడు. వివరాల్లోకి వెళ్తే, కిషోర్ అనే కస్టమర్ ఈ నెల 12న ఐకియా రెస్టారెంట్ కు వెళ్లాడు. తన కూతురు కోసం ఓ చాక్లెట్ కేక్ ఆర్డర్ చేశాడు. కేక్ తీసుకొచ్చాక చూస్తే... కేకుపై ఓ పురుగు పాకుతోంది. దీంతో, ఆ పురుగును, ఆర్డర్ కాపీని, బిల్లును వీడియో తీసి మున్సిపల్ అధికారులకు, హైదరాబాద్ పోలీసులకు ట్యాగ్ చేశాడు.

అయితే తన ఫిర్యాదుకు ఎలాంటి స్పందన రాకపోవడంతో... రెండు రోజుల క్రితం మరో వీడియోను కిశోర్ పోస్ట్ చేశాడు. తన ఫిర్యాదు పట్ల ఎందుకు స్పందించలేదని ప్రశ్నించాడు. దీంతో, మున్సిపల్ అధికారులు స్పందించి... ఐకియాకు రూ. 5 వేల జరిమానా విధించారు. ఈ ఘటనపై ఐకియా స్పందించింది. ఐకియా ప్రతినిధి మాట్లాడుతూ, చాక్లెట్ కేక్ లో పురుగు వచ్చినందుకు చింతిస్తున్నామని చెప్పారు. అనుకోకుండా ఇది జరిగిందని, తమను క్షమించాలని కోరాడు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కావని తెలిపారు.
 

English Title
Bug problem at IKEA! Customer finds insect in chocolate cake at Hyderabad store

MORE FROM AUTHOR

RELATED ARTICLES