లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై స్పందించిన జగన్..ఏమన్నారంటే

లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై స్పందించిన జగన్..ఏమన్నారంటే
x
Highlights

చివరి నిమిషం వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల అవుతుందా లేదా అనే అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉండే కానీ ఎట్టకేలకు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన...

చివరి నిమిషం వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల అవుతుందా లేదా అనే అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉండే కానీ ఎట్టకేలకు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మార్చి 29న విడుదల విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏపీలో మాత్రం విడుదల కాలేదు. ఇక విడుదలైన అన్ని చోట్ల లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. పైగా విడుదలకు ముందే బోలెడు వివాదాల్లో చిక్కుకోవడం వల్ల ఈ చిత్రానికి ప్రమోషన్లు భారీగానే దక్కాయి. కాగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల చేసేది లేనిది ఏప్రిల్ 3న చెబుతామని హైకోర్టు చెప్పిన విషయం తెలిసిందే కాగా దీనిపై సుప్రీంకోర్టుకు వెళతామని రామ్ గోపాల్ వర్మ, నిర్మాత స్పష్టం చేశారు.

కాగా ఈ సినిమాపై వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో ఎన్నికల ప్రచారంలో ఉన్న జగన్ ఈ సినిమాను ఏపీలో విడుదల కావొద్దని చంద్రబాబు అడ్డుకుంటున్నారని జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా వెండితెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏపీ ప్రజలు చూడకూడదని చంద్రబాబు భావిస్తున్నారన్నారు. ఎక్కడ సినిమా చూస్తే ఏపీ ప్రజలకు తన వెన్నుపోటు చరిత్ర తెలిసిపోతుందోఅని చంద్రబాబు భయపడుతున్నారని జగన్ ఆరోపించారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రపై తెరకెక్కించారని తెలిపారు. కేవలం ఏపీలో మహానాయకుడు సినిమా మాత్రమే చంద్రబాబు కోరుకుంటున్నారని అన్నారు. టీడీపీ సర్కార్ తమకు మాత్రమే అనుకూలమైన పత్రికలు, టీవీలను మాత్రమే ఏపీ ప్రజలు చూడాలని అనుకుంటోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories