ప్రజారోగ్యానికి ప్రాణాతంకంగా పరిణమిస్తున్న శాంతికపోతాలు

ప్రజారోగ్యానికి ప్రాణాతంకంగా పరిణమిస్తున్న శాంతికపోతాలు
x
Highlights

పక్షుల్లో పావురాలు తెలివైనవని అందరికి తెలుసు. వాటిని చూడగానే అంతా సంబరపడిపోతారు. ఆహ్లాదం కోసమో... పుణ్యం వస్తుందనో పెంచుకునేందుకు ఇష్టపడుతారు కానీ అవే...

పక్షుల్లో పావురాలు తెలివైనవని అందరికి తెలుసు. వాటిని చూడగానే అంతా సంబరపడిపోతారు. ఆహ్లాదం కోసమో... పుణ్యం వస్తుందనో పెంచుకునేందుకు ఇష్టపడుతారు కానీ అవే పావురాలు ఇప్పుడు ప్రాణంతకంగా మారుతున్నాయి. నిఫా వైరస్ తరహా ఉపద్రవం పొంచి ఉంది. పావురాల విసర్జితాలతో అరడజనుకు పైగా అనారోగ్య సమస్యలు ప్రబలుతున్నాయి.

భారతీయ సంస్కృతిలో శాంతికి నిదర్శం పావురాలు పక్షుల్లో పావురాలు ఎంతో తెలివైనవి. పురాతన కాలంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు పావురాలను వాడేవారు. అవి మార్గం మరచిపోకుండా వెళ్లి వచ్చేవని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం చూపగలిగేవి. ఇంతటి మేధోశక్తి ఉన్న పావురాలు సాధుకునేందుకు అంతా ఇష్టపడుతుంటారు. కానీ ఇప్పుడు అవే శాంతికపోతాలు ప్రజారోగ్యానికి ప్రాణాతంకంగా పరిణమిస్తున్నాయి.. పావురాల విసర్జితాలతో తీవ్ర అనారోగ్య సమస్యలు ప్రబలున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అమెరికా విడుదల చేసిన తాజా ఆధ్యయన నివేదిక హెచ్చరించింది.

శ్వాస సంబంధ వ్యాధులతో ఆస్పత్రులపాలయ్యే రోగుల్లో సగం మందికి ఆ సమస్యలు రావడానికి పావురాలు కారణమవుతున్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. పావురాల విసర్జితాలు ఎండిపోయి పొడిలా మారి గాలిలో చేరుతున్నాయి. పావురాల రెక్కల ద్వారా కూడా వేగంగా వ్యాపిస్తున్నాయి. వాటిని ఎక్కువగా పీల్చే వారు శ్వాససంబంధ వ్యాధులకు గురవుతున్నారు. ఇప్పటికే విజదేశాల్లో పావురాలకు బహిరంగంగా దాణా వేయడాన్ని నిలిపి వేశారు. హైదరాబాద్ సిటీలో దాదాపు ఆరు లక్షల పావురాలు ఉండ వచ్చని అంచనా వేస్తున్నారు. పావురాలతో ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విభాగాదిపతులు తొలిసారి అధ్యయనం జరుపుతున్నారు. పావురాలతో ప్రమాదం పొంచి ఉందనే నిర్ధారణకు వచ్చారు. పావురాలు కట్టడి చేసేందుకు చర్యలు ప్రారంభించాలని సూచిస్తున్నారు.

హైదరాబాద్ నగర వాసులు మాత్రం పావురాలతో ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తించడం లేదు. అహ్లాదం కోసం. పుణ్యం కోసం వాటిని సాదుకునేందుకు ఇష్టపడుతున్నారు. పలు చోట్ల పావురాలకు విచ్చలవిడిగా దాణా వేస్తున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు. మరో రెండు, మూడేళ్లలో పావురాల సంఖ్య 10 లక్షలను దాటే పరిస్థితి ఉన్నందున ఇప్పుడు మేల్కొనకుంటే యావత్‌ హైదరాబాద్‌ జబ్బు పడే ప్రమాదం ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories