ఉద్యోగుల చూపు బీజేపీ వైపు మళ్లిందా?

ఉద్యోగుల చూపు బీజేపీ వైపు మళ్లిందా?
x
Highlights

ఉద్యోగుల చూపు బీజేపీ వైపు మళ్లిందా. తాజా లోక్ సభ ఫలితాలే ఇందుకు అద్దం పడుతుంది. తెలంగాణాలో బీజేపీ గెలిచిన నాలుగు స్థానాల్లోనే కాకుండా ఇతర...

ఉద్యోగుల చూపు బీజేపీ వైపు మళ్లిందా. తాజా లోక్ సభ ఫలితాలే ఇందుకు అద్దం పడుతుంది. తెలంగాణాలో బీజేపీ గెలిచిన నాలుగు స్థానాల్లోనే కాకుండా ఇతర నియోజకవర్గాల్లోనూ బీజేపీకి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అత్యధికంగా పోలయ్యాయి. తర్వాతి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధులకు రాగా మూడో స్థానంలో అధికార టీఆర్ఎస్ అభ్యర్ధులకు లభించినట్లు కౌంటింగ్ లెక్కల్లో తేలింది. తెలంగాణలో ఉద్యోగుల చూపు బీజేపీపై పడింది. రాష్ర్టంలో 17 లోక్ సభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ సత్తా చాటింది. మెజార్టీ ఉద్యోగులు బీజేపీకి ఓటు వేశారు. అత్యధిక స్థానాల్లో బీజేపీకి అధికార పార్టీ కన్నా అత్యధికంగా పోస్టల్ ఓట్లు పోలయ్యాయి. 35.77 శాతం మంది ఉద్యోగులు బీజేపీకి మొగ్గు చూపారు. కాంగ్రెస్ అభ్యర్ధులకు 29.8 శాతం రాగా.. టీఆర్ఎస్ కు కేవలం 27.24 శాతం మాత్రమే వచ్చాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 55 వేల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా..17,319 ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వినియోగించుకున్నారు. వీరిలో అత్యధికంగా 6 వేల196 మంది ఉద్యోగులు బీజేపీ అభ్యర్ధులకు పోస్టల్ ఓటు వేశారు. ఇక 5,162 మంది ఉద్యోగులు కాంగ్రెస్‌ అభ్యర్థులకు వేయగా, 4,718 మంది ఉద్యోగులు టీఆర్‌ఎస్‌కు వేశారు. మిగతా వారు ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీ, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులకు వేశారు.

బీజేపీ అభ్యర్ధులు గెలిచిన సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గాల్లోనే కాకుండా మహబూబ్‌నగర్, మెదక్, నాగర్‌కర్నూలు, పెద్దపల్లి, జహీరాబాద్ నియోజకవర్గాల్లోనూ బీజేపీ అభ్యర్థులకు అత్యధిక పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి. ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు, నల్లగొండ లోక్‌సభ పరిధిలో కాంగ్రెస్‌కు పోస్టల్ ఓట్లు పోలయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories