ఇండో-పాక్ యుద్ధ వీరుడు కుల్దీప్ సింగ్ కన్నుమూత

Submitted by nanireddy on Sat, 11/17/2018 - 19:53
brigadier-kuldip-singh-chandpuri-the-heroic-border-man-who-defied-pakistani-tanks

1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో పాక్ సైన్యంపై వీరోచిత పోరాటం చేసిన బ్రిగేడియర్ కుల్దీప్ సింగ్ చంద్రపురి (78) మృతి చెందారు. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన నేడు తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్ చికిత్స కోసం కుల్దీప్ సింగ్ పంజాబ్‌ మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన ఆరోగ్యం విషమించి మృతిచెందారని వైద్యులు వెల్లడించారు. అయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం జరిగినప్పుడు ఆయన ఇండియన్ ఆర్మీలో మేజర్‌గా పనిచేస్తున్నారు. రాజస్థాన్‌లోని లాంగేవాలా బోర్డర్ పోస్టును పాక్ సైనికుల నుంచి కాపాడారు.

ఈ యుద్ధంలో 40 యుద్ధ ట్యాంకులతో భారత్‌వైపు దూసుకొస్తున్న 2 వేల మంది పాకిస్థానీ సైనికులను అత్యంత ధైర్య సాహసాలతో ఎదిరించారు. ఈ యుద్ధం కేవలం వందమంది సైనికులతోనే కుల్దీప్ సింగ్ ఎదుర్కొన్నారు. ఈ యుద్ధం అనంతరం అప్పటివరకు భారత్ లో అంతర్భాగమైన బంగ్లాదేశ్‌ స్వతంత్ర దేశంగా అవతరించింది. బాలీవుడ్ దర్శక నిర్మాత జేపీ దత్ 1977లో లాంగేవాలా యుద్ధాన్ని కథాంశంగా తీసుకుని ‘బోర్డర్’ సినిమాను తెరకెక్కించారు. ఇక కుల్దీప్ సింగ్ ధైర్య సాహసాలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనను అత్యున్నత పతకం మహావీర్ చక్రతో సన్మానించింది. కుల్దీప్ సింగ్ మృతికి పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు.

English Title
brigadier-kuldip-singh-chandpuri-the-heroic-border-man-who-defied-pakistani-tanks

MORE FROM AUTHOR

RELATED ARTICLES