రేపు ప్రజాసంకల్పయాత్ర నిలుపుదల

Submitted by arun on Wed, 02/07/2018 - 15:09
ys jagan

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు రేపు (గురువారం) నిలుపుదల చేయనున్నట్లు ఆ పార్టీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం వామపక్షాలు రేపు ఏపీ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు మద్దతు ప్రకటిస్తున్నట్టు వైసీపీ ప్రకటించింది. రేపటి బంద్ కు సంఘీభావంగా పార్టీ అధ్యక్షుడు జగన్ తన పాదయాత్రను నిలుపుదల చేస్తున్నట్టు తెలిపింది. ఏపీ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలంతా ఒక్క తాటిపై నిలబడాలని, రేపటి బంద్ ను విజయవంతం చేయాలని వైసీపీ కోరింది. 

English Title
break praja sankalpa yatra over ap bandh

MORE FROM AUTHOR

RELATED ARTICLES