అడవిలో ఒకే ఒక్కడు...22 సంవత్సాల పాటు ఒంటరి జీవితం...

x
Highlights

అదో దట్టమైన అడవి అక్కడ ఒక్క రోజు గడపాలంటేనే ప్రాణం మీదకు వస్తుంది. అలాంటిది ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా 22 సంవత్సరాలు ఓ వ్యక్తి అడవిలో...

అదో దట్టమైన అడవి అక్కడ ఒక్క రోజు గడపాలంటేనే ప్రాణం మీదకు వస్తుంది. అలాంటిది ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా 22 సంవత్సరాలు ఓ వ్యక్తి అడవిలో నివసిస్తున్నాడంటే నమ్మగలమా అవును నిజంగా నమ్మాల్సిందే. చెట్లు., చేమలు, జంతువులతో కాలక్షేపం చేస్తూ టార్జాన్ ను తలపిస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరన్నది అంతుచిక్కడం లేదు.

అడవిలో ఒకే ఒక్కడు..22 సంవత్సాల పాటు ఒంటరి జీవితం...బ్రెజిల్ లోని దట్టమైన అటవీ ప్రాంతం.. అక్కడ ఒక్క రోజు గడపాలంటేనే ఒళ్లు జలదరిస్తుంది. కానీ ఈ ప్రాంతంలో గిరిజన తెగకు చెందిన ఓ వ్యక్తి 22 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ ఆధునిక ప్రపంచంలో కూడా అడవిలో దొరికే ఆకులు అలములు తింటూ బతుకుతున్నాడు.

బ్రెజిల్ అటవీ ప్రాంతంలో రెండు దశాబ్దాలకు పైగా ఒంటరి జీవనం సాగిస్తున్న వ్యక్తి పేరేంటో తెలియదు. పూర్వీకుల గురించిన సమాచారం కూడా ఏమీ లేదు. అమెజాన్ అటవీ ప్రాంతంలో ఒంటరిగా బతుకు వెళ్లదీస్తున్న ఆ అజ్ఞాత వాసిపై పర్యవేక్షణ జరుపుతున్న బ్రెజిల్ లోని ఇండియన్ ఫౌండేషన్ తొలిసారిగా ఈ దృశ్యాలను విడుదల చేసింది. గొడ్డలితో ఒక చెట్టును నరుకుతుండగా కొద్ది దూరం నుంచి వీడియోలు చిత్రీకరించారు.

1996లో తన సహచరుడు హత్యకు గురైన తర్వాత నుంచి ఆ వ్యక్తి ఒంటరిగా బతుకుతున్నట్లు ఫౌండేషన్ తెలిపింది. తన జాతికి సంబంధించిన వారు అంతమైనప్పటికీ బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా జీవనం సాగిస్తున్నాడు. పైగా ఒంటరి జీవితం గడుపుతున్నా...శారీరకంగా ఎంతో ఉత్సాహంగా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అమెజాన్ తెగకు చెందిన ఈ ఏకైక వ్యక్తి అడవిలో ఒంటరిగా ఎలా మనుగడ సాగిస్తున్నాడో ఎవరికీ అంతుచిక్కడం లేదు. విషయం తెలిసినవారంతా ఆశ్చర్యపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories