బ్రహ్మానందాన్ని.. జీవిత ఏమని పిలుస్తుందో తెలుసా?

Submitted by arun on Mon, 03/12/2018 - 14:33
Bramhanandam

బ్రహ్మానందం ప్రముఖ హాస్య నటుడు. జీవిత.. డైరెక్టర్ గా, నటిగా మంచి పేరు తెచ్చుకుంది. అలాంటి జీవితతో.. తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని బ్రహ్మానందం అందరితో పంచుకున్నాడు. టీఎస్ఆర్ కాకతీయ లలిత కళా పరిషత్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ లో జరిగిన సన్మాన కార్యక్రమంలో.. హాస్య నట బ్రహ్మ బిరుదును బ్రహ్మానందం అందుకున్నాడు.

ఈ సందర్భంగా.. కార్యక్రమ నిర్వాహకుడు టీ. సుబ్బరామిరెడ్డితో పాటు.. సినిమా పరిశ్రమలో ప్రముఖులు మోహన్ బాబు, ఆలీ, గుండు హనుమంతరావు, శివారెడ్డి, శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్లతో తన అనుబంధాన్ని వివరిస్తూ.. జీవిత విషయానికి వచ్చారు. తనను జీవిత ఎప్పుడూ డాడీ అని పిలుస్తూ ఉంటుందని.. అలాగే ఆమె భర్త హీరో రాజశేఖర్ తనకు అల్లుడి లాంటి వాడనీ బ్రహ్మానందం చెప్పారు.

ఇలా.. సినిమా ఇండస్ట్రీలో చాలా మందితో తనకు ఆత్మీయ అనుబంధం ఉందన్న బ్రహ్మానందం.. తనకు అవార్డు ప్రదానం చేసి సత్కరించిన సుబ్బరామిరెడ్డికి కూడా ధన్యవాదాలు చెప్పారు. తానో సామాన్య నటుడిని అన్న బ్రహ్మానందం.. మహనీయులు పుట్టిన తెలంగాణ గడ్డపై సత్కారం అందుకోవడాన్ని గర్వంగా భావిస్తున్నట్టు చెప్పారు.

English Title
Brahmanandam gets the title of 'Hasya Nata Brahma'

MORE FROM AUTHOR

RELATED ARTICLES