ఫేస్‌బుక్‌ ప్రేమికుని ఆత్మహత్య .. పరారీలో ప్రియురాలు

Submitted by arun on Tue, 06/19/2018 - 12:18
lovers

ఫేస్ బుక్ కేంద్రంగా తాను సాగించిన ప్రేమ విఫలమైందన్న కారణంతో ఓ ప్రియుడు ఆత్మహత్య చేసుకోగా, ప్రస్తుతం పరారీలో ఉన్న అతని ప్రియురాలు, ఆమె సోదరుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కర్ణాటకలోని గౌరిబిదనూరు సమీపంలో జరిగిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే, గౌరిబిదనూరులోని నెహ్రూ నగర్‌లో నివసిస్తున్న రంజిత్‌కుమార్‌ (24) అనే యువకుడు తన ప్రేమ వైఫల్యంపై సెల్‌ఫోన్‌లో మరణ వాంగ్మూలాన్ని వీడియో రికార్డ్‌ చేసి శనివారం ఫేస్‌బుక్‌లో పెట్టాడు. ఆవేదన తట్టుకోలేక ఆదివారం ఉదయం పురుగుల మందు తాగి తరువాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే.

అతని ప్రియురాలు, హిందూపురం తాలూకా మేళాపురానికి చెందిన ఒక డిగ్రీ విద్యార్థిని (20), ఆమె సోదరుడు నిఖిల్‌ తనను అన్ని విధాలా మోసగించారని, వారిని శిక్షించాలని ఫేస్‌బుక్‌ వీడియోలో కోరుతూ ప్రాణాలు తీసుకున్నాడు. మృతుని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రియురాలు, ఆమె అన్న కోసం పోలీసులు ఆరా తీయగా పరారీలో ఉన్నట్లు తేలింది. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.  


 

English Title
boy friend commits suicide lover escape

MORE FROM AUTHOR

RELATED ARTICLES