రామేశ్వరంలో కలిసిపోనున్న శ్రీదేవి…!

Submitted by lakshman on Sat, 03/03/2018 - 19:50
Sridevi's ashes

అతిలోక సుందరి శ్రీదేవి చనిపోయినా.. ఆమె అందం మాత్రం ఇంకా మనల్ని విడిచిపెట్టడం లేదు. శ్రీదేవి బతికే ఉందేమో.. నిన్నటివరకూ జరిగింది కలేనేమో .. అని అనుకునే వాళ్లు కూడా ఇంకా ఉన్నారంటే.. ఎంత మాత్రం అతిశయోక్తి కానేకాదు. అంతగా తన అందంతో సమ్మోహనం చేసిన శ్రీదేవి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఆమె అంత్యక్రియలను శాస్త్రోక్తంగా జరిపించిన కుటుంబం.. ఇప్పుడు అస్తికలను కూడా సంప్రదాయం ప్రకారం రామేశ్వరంలో కలిపేందుకు ఆమె కుటుంబం నిర్ణయించింది.

ఇవాళ రామేశ్వరంలో అస్తికల నిమజ్జనం తర్వాత తిరిగి బోనీకపూర్ కుటుంబం ముంబై వెళ్లిపోనుంది. శ్రీదేవి మరణంపై ఇప్పటికే.. తమను మనసారా బాధపడనివ్వండి అంటూ మీడియాకు విజ్ఞప్తి చేసిన బోనీ ఫ్యామిలీ.. అస్తికల నిమజ్జన కార్యక్రమాన్ని కూడా అంతగా హైలైట్ కానివ్వొద్దని కోరుతున్నట్టుగా తెలుస్తోంది.

కానీ.. శ్రీదేవికి సంబంధించిన చివరి కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటి కావడంతో.. అభిమానులు మరింత ఆవేదన చెందుతున్నారు. రామేశ్వరంలో భౌతికంగా.. సంపూర్ణంగా అంతర్థానం అవుతున్న శ్రీదేవిని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.

English Title
Boney Kapoor to immerse Sridevi's ashes in Rameswaram today

MORE FROM AUTHOR

RELATED ARTICLES