సీటు కింద బాంబ్

సీటు కింద బాంబ్
x
Highlights

మీరు కదలకుండా కుర్చీలో కూర్చొని వర్క్ చేస్తున్నారా..మీ పక్కన ఫ్రెండ్స్ చీటికి మాటికి లేచి వె‌ళ్లివస్తున్నా మీరు మాత్రం కదలడం లేదా.. అయితే మీరు రోజూ...

మీరు కదలకుండా కుర్చీలో కూర్చొని వర్క్ చేస్తున్నారా..మీ పక్కన ఫ్రెండ్స్ చీటికి మాటికి లేచి వె‌ళ్లివస్తున్నా మీరు మాత్రం కదలడం లేదా.. అయితే మీరు రోజూ రెండు డబ్బాల సిగరెట్లు తాగుతున్నట్లే.. అదేంటి ఏ అలవాటు లేని మిమ్మల్ని సిగరెట్ తాగుతున్నారని చెబుతున్నాం అనుకుంటున్నారా..అదే కాదు కదలకుండా కూర్చునే మీకు డయాబెటిక్, కాన్సర్, గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ కన్ఫూజన్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరి చూడండి.

పొద్దస్తమానం కూర్చోవడం, ఆఫీసుల్లో పనిచేసే కుర్చీకే అతుక్కుపోవడం లాంటివి చేసేవాళ్లకు భయంకరమైన అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. అంతేకాదు అదే పనిగా కూర్చోవడం అంటే పొగతాగడంతో సమానమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎక్కువ సమయం కూర్చొనేవారు కేన్సర్‌వ్యాధి బారిన పడుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. సాధారణంగా పొగతాగడం వల్ల గుండెజబ్బులు, పక్షవాతం బారినపడే అవకాశాలు సాధారణం కన్నా నాలుగురెట్లుకు పెరుగుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇదేకాదు శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్‌ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందరూ పొగతాగకపోవచ్చు కానీ, దాదాపు ఎక్కువ గంటలు కూర్చుని ఉంటారనేది వాస్తవం. ఆఫీసులో కావొచ్చు, వ్యాపార సంస్థలో కావొచ్చు, టీవీ ముందు కావొచ్చు, చాలామంది రోజుకు 10 గంటల పాటు కూర్చుని ఉంటారు. ఎక్కువ సమయంలో కూర్చోవడం వల్ల కండరాల శ్రమ పూర్తిగా ఆగిపోతుందని, దీనివల్ల శరీరం పలురకాల దుష్ప్రభావాలకు లోనవుతుందని చెబుతున్నారు.

వాస్తవానికి కండరాల ప్రక్రియలు రక్తంలోని చక్కెర విలువల్ని శరీరమంతా వ్యాపింపజేస్తాయి. రక్తంలోని కొవ్వు పదార్థాలను శక్తిగా మారుస్తాయి. మామూలుగా అయితే నడుస్తున్నప్పుడు, కనీసం నిలుచుని ఉన్నప్పుడు శరీరంలోని అత్యధిక కండరాలు రక్తంలోని షుగర్‌ను, కొవ్వు పదార్థాలను సంగ్రహిస్తాయి. అయితే ఎక్కువ గంటలు కూర్చుని ఉండడం వల్ల రక్తంలోని షుగర్‌, కొవ్వు సామాన్యస్థితికి రాలేదు. పైగా ఎక్కువ సమయం కూర్చునే ఉండటం వల్ల రక్తనాళాలు తమ సహజమైన సంకోచ, వ్యాకోచ సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఈ స్థితి ఎక్కువకాలం సాగితే, అది శరీరంలో కొలెస్ట్రాల్‌ నిల్వలు పెరగడానికి, మధుమేహం రావడానికి దారితీస్తుందని పరిశోధకులు వివరిస్తున్నారు. మిగులు శక్తి అంతా కొవ్వుగా మారి రక్తనాళాలు దెబ్బతినడానికి కారణమవుతుంది. చివరకు గుండె రక్తనాళాలు దెబ్బతిని, గుండెజబ్బులు రావడానికి గానీ, పక్షవాతం రావడానికిగానీ దారితీయవచ్చు అంటున్నారు పరిశోదకులు. గతంలో కంప్యూటర్ లముందు కూర్చునే వారికి కంటి జబ్బులు మాత్రమే వచ్చేవి అని వినేవాళ్లం..కాని ఇప్పుడు దాదాపు మరో 34 రకాల విషమ పరిస్థితులకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మాకు ఏ చెడు అలవాట్లు లేవు కదా..తాము ఆరోగ్యంగానే ఉన్నామంటే తప్పే అంటున్నారు డాక్టర్లు. ఇలా కదలకుండా కూర్చుంటేనే ఇన్ని జబ్బులకు కారణమవుతోందని..అందుకే కాస్త అటూ ఇటూ తిరుగుతూ వ్యాయామం చేస్తే ఏ సమస్యలు దరి చేరవు.

Show Full Article
Print Article
Next Story
More Stories