పొలంలో పేలిన నాటుబాంబులు..ఇద్దరు మృతి

Submitted by arun on Tue, 07/31/2018 - 14:06
bomb blast

కర్నూల్ లో బాంబు కలకలం రేగింది. నగర సమీపంలోని జోహారపురం దగ్గర పొలాన్ని కొలుస్తుండగా బాంబ్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలు జిల్లా జోహరాపురంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. పొలంలో కొలతలు వేస్తుండగా ఒక్కసారిగా నాటుబాంబులు పేలాయి. ఈ ఘటనలో జంపాల మల్లికార్జున (60) అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు విజిలెన్స్‌ ఏఎస్‌ఐ శ్రీను, జంపాల రాజశేఖర్‌గా గుర్తించారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ జంపాల రాజశేఖర్ మృతి చెందాడు. ఏఎస్‌ఐ శ్రీను పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
 

English Title
bomb blast in field

MORE FROM AUTHOR

RELATED ARTICLES