గద్వాలలో ఘోరరోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి

గద్వాలలో ఘోరరోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి
x
Highlights

జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం బోల్తా పడి ఐదుగురు చనిపోయారు 15కి తీవ్ర గాయాలయ్యాయి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి....

జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం బోల్తా పడి ఐదుగురు చనిపోయారు 15కి తీవ్ర గాయాలయ్యాయి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులంతా జిన్నింగ్‌మిల్లులో పనిచేసి తిరుగు ప్రయాణంలో ఉండగా ధరూర్‌-గోనుపాడు గ్రామాల మధ్య ప్రమాదం జరిగింది. మృతులు చిన్నపాడు, యమునోనిపల్లికి చెందినవారిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారికి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ..స్వల్సంగా గాయపడిన వారికి గద్వాల ప్రభుత్వాసుపత్రిలోనూ చికిత్స అందిస్తున్నారు.

చిన్నపాడు, యమునోనిపల్లికి చెందిన కూలీలు గద్వాల పట్టణంలోని జిన్నింగ్‌మిల్లులో పనిచేస్తున్నారు. విధులు ముగించుకుని బొలెరో వాహనంలో స్వగ్రామాలకు పయనమయ్యారు. ఇంతలో వారు ప్రయాణిస్తున్న వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనా స్థలాన్నిగద్వాల డీఎస్పీ సురేంద్రరావు పరిశీలించారు. మృతులను వెంకటన్న, రోహిత్, గీత, అరుణ, వెంకటేష్‌గా గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే బొలెరో వాహనం బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది.

ప్రమాద సమయంలో బొలెరో వాహనం కిక్కిరిసిపోయిఉంది. ఆ వాహనంలో మొత్తం 40 మంది కూలీలు ఉన్నారు. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో బొలెరో వాహనం ఒక్కసారిగా అదుపు తప్పింది. తర్వాత రోడ్డు పక్కన గోతిలోకి వెళ్ళి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు స్పాట్‌లోనే చనిపోయారు. గద్వాల జిల్లా ఎస్పీ వియజకుమార్ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి..వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అటు మాజీ ఎమ్మెల్యే డీకే భరతసింహా రెడ్డిబాధితుల్ని పరామర్శించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories