మరో టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరిక

Submitted by nanireddy on Thu, 11/15/2018 - 21:36
bodige sobha joined in bjp

ఎన్నికల సందర్బంగా వివిధ పార్టీలలోకి వలసలు ఊపందుకుంటున్నాయి. టీఆర్ఎస్ లో సీటు దక్కకపోవడంతో ఆ పార్టీకి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.. తాజాగా అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే బొడిగె శోభ కూడా బీజేపీలో చేరిపోయారు. ప్రస్తుతం చొప్పదండి ఎమ్మెల్యేగా ఉన్న శోభ పట్ల తెరాస అధిష్టానం కొంతకాలంగా అసంతృప్తితో  ఉంది. ఈ క్రమంలో ఆమెకు సీటు నిరాకరించింది. దాంతో ఆమె బీజేపీలో చేరిపోయారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షడు లక్ష్మణ్ ఆమెకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.  టీఆరెస్ బీ-ఫారమ్ తనకే వస్తుందని ఆశించిన శోభ... కొద్దిరోజులపాటు వేచిచూసింది. అయితే నామినేషన్ తంతు దగ్గరపడుతుండటంతో... గులాబీ దళానికి గుడ్ బై చెప్పాలనే నిర్ణయం తీసుకొని మండలాల వారిగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. దళిత మహిళకు అన్యాయం చేశారని కంటతడి పెట్టుకొని ప్రజలనే నమ్ముకున్నానని ఆమె బీజేపీలో చేరిన అనంతరం వ్యాఖ్యానించారు. ఆమెకు చొప్పదండి అసెంబ్లీ టికెట్ కేటాయించింది బీజేపీ. 

English Title
bodige sobha joined in bjp

MORE FROM AUTHOR

RELATED ARTICLES