విహారయాత్రలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి

విహారయాత్రలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి
x
Highlights

విద్యార్థుల విహారయాత్ర చివరికి విషాదంగా ముగిసింది. ముంబయి దగ్గర్లో బోటు తలకిందులై ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికోసం గాలిస్తున్నారు. బోటులో...

విద్యార్థుల విహారయాత్ర చివరికి విషాదంగా ముగిసింది. ముంబయి దగ్గర్లో బోటు తలకిందులై ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికోసం గాలిస్తున్నారు. బోటులో ప్రయాణిస్తున్న 32 మంది విద్యార్థులను తీర గస్తీ దళం, స్థానిక మత్స్యకారులు కాపాడారు. ముంబై దగ్గర్లోని దహను తీరంలో ఈ దుర్ఘటన జరిగింది. తీరం నుంచి రెండు నాటికల్ మైళ్ళ దూరంలో విద్యార్థులు ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది. నావికా దళంతో పాటు హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ప్రమాద పమయంలో 40 మంది విద్యార్థులు బోటులో ప్రయాణిస్తున్నారు.

విహారయాత్రలో భాగంగా KL. పొండా స్కూలుకు చెందిన 40 మంది విద్యార్థులు దహను బీచ్‌ నుంచి సముద్రంలోకి బోటులో వెళ్లారు. తీరం నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంగా.. బోటు ఒక్కసారిగా తలకిందులైంది. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ సిబ్బంది.. బోటువద్దకు చేరుకుని విద్యార్థులను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆరుగురు ప్రాణాలు విడిచారు. వెంటనే సమాచారం అందుకున్న సిబ్బంది సహాయ చర్యలు చేపట్టి 32 మంది విద్యార్థులను సురక్షితంగా రక్షించగలిగారు. గల్లంతయిన ఇద్దరికోసం ముమ్మర గాలింసు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories