కృష్ణ జింకల వేట కేసులో నేడే తీర్పు

కృష్ణ జింకల వేట కేసులో నేడే తీర్పు
x
Highlights

బాలీవుడ్ నటులు సల్మాన్, సైఫ్ అలీఖాన్, హీరోయిన్లు టబూ, సోనాలీ, నీలమ్‌పై 1998లో నమోదైన నల్లజింకల వేట కేసులో జోథ్‌పూర్ కోర్టు తీర్పు మరికాసేపట్లో కీలక...

బాలీవుడ్ నటులు సల్మాన్, సైఫ్ అలీఖాన్, హీరోయిన్లు టబూ, సోనాలీ, నీలమ్‌పై 1998లో నమోదైన నల్లజింకల వేట కేసులో జోథ్‌పూర్ కోర్టు తీర్పు మరికాసేపట్లో కీలక తీర్పు వెలువరించనుంది. 20 ఏళ్ల తర్వాత తీర్పు రానుండటంతో ఉత్కంఠ నెలకొంది. ట్రయిల్ కోర్టులో తుది వాదనలు పూర్తి చేసుకున్న కేసు తీర్పును మెజిస్ట్రేట్ దేవ్‌కుమార్ ఖాత్రి రిజర్వ్‌లో ఉంచారు. తీర్పు ఇవాళ వెలువడనుండటంతో జోథ్‌పూర్ కోర్టు వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

ఈ కోసులో దోషులుగా తేలినట్లయితే ఏడాది నుంచి ఆరేళ్లు వరకూ శిక్ష విధించే అవకాశం ఉందని నిందితుల తరఫు లాయర్లు అంటున్నారు. వన్యప్రాణుల చట్టం ప్రకారం నల్లజింకల వేట, చంపడం నేరమైనప్పటికీ రెండు దశాబ్దాల క్రితం సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్‌లోని కంకణి ప్రాంతానికి వెళ్లినప్పుడు సల్మాన్ బృదం ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అభియోగాలు నమోదయ్యాయి. ఇవాళ కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో సల్మాన్‌ఖాన్‌తో పాటు బాలీవుడ్‌ నటులు సైఫ్‌ అలీఖాన్‌, టాబూ, సోనాలీ బింద్రే, నీలమ్‌ తదితరులు జోధ్‌పుర్‌ చేరుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories