ఒకే జైల్లో..ప్ర‌తి ఫ్రెండూ అవ‌స‌ర‌మేరా

ఒకే జైల్లో..ప్ర‌తి ఫ్రెండూ అవ‌స‌ర‌మేరా
x
Highlights

కృష్ణ జింకల వేట కేసులో దోషిగా తేలడంతో బాలీవుడు నటుడు సల్మాన్ ఖాన్‌ను జోథ్‌పూర్‌ సెంట్రల్‌కు తరలించారు. జైలులో సల్మాన్‌ఖాన్‌కు 106 నెంబర్‌ను...

కృష్ణ జింకల వేట కేసులో దోషిగా తేలడంతో బాలీవుడు నటుడు సల్మాన్ ఖాన్‌ను జోథ్‌పూర్‌ సెంట్రల్‌కు తరలించారు. జైలులో సల్మాన్‌ఖాన్‌కు 106 నెంబర్‌ను కేటాయించారు. లైంగిక వేధింపులో కేసులో అరెస్టైన ఆశారాం బాపు ఉంటున్న గది పక్కనే సల్మాన్‌ఖాన్‌కు గదిని కేటాయించారు. సినీ నటుడుగా పేరు ప్రఖ్యాతలున్న సల్మాన్‌ఖాన్‌ను సాధారణ ఖైదీలుగానే జైలులో ట్రీట్ చేస్తామని జైల్ అధికారులు ప్రకటించారు.
గదిలో ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు కూడా లేవు. కేవలం ఒక ఫ్యాన్‌ మాత్రమే ఉంది. నేలపైనే సల్మాన్ నిద్రపోవాల్సి ఉంటుందని జైలు సూపరింటెండెంట్‌ విక్రమ్‌ సింగ్‌ తెలిపారు. సల్మాన్‌కు కేటాయించిన గదిలో ఏ ఖైదీని ఉంచడం లేదని ఆయన పేర్కొన్నారు.
కాగా కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌‌ను జోథ్‌పూర్‌ కోర్టు దోషిగా తేల్చింది. మిగితా ఐదుగురు నటులను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి మార్చి 28నాటికి తుదివాదనలు పూర్తయ్యాయి. అయితే చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ దేవ్‌కుమార్ కత్రి తీర్పును వాయిదా వేశారు. ఈరోజు కేసు విచారణకు రాగా సల్మాన్‌ఖాన్‌ను కోర్టు దోషిగా తేల్చింది.
1998 అక్టోబర్‌లో జరిగిన ఓ షూటింగ్ సందర్భంగా జోథ్‌పూర్ సమీపంలోని కంకణి గ్రామంలో కృష్ణజింకలను హతమార్చినట్లు సల్మాన్‌పై కేసు నమోదు అయ్యింది. ఇందులో సల్మాన్ ఖాన్‌పై వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 51కింద కేసు నమోదు చేశారు. ఇతర నటులపై సెక్షన్ 149కింద కేసు నమోదు అయ్యింది. అయితే మిగతా ఐదుగురు నటులను నిర్దోషులంటూ జోథ్‌పూర్ కోర్టు తీర్పునిచ్చింది.
జింకల వేట కేసులో ఈరోజు తీర్పు సందర్భంగా సల్మాన్‌ఖాన్‌తో పాటు సైఫ్ అలీఖాన్, టబూ, సొనాలిబింద్రే, నీలం తదితరులు జోథ్‌పూర్ కోర్టుకు చేరుకున్నారు. కేసు విషయంలో జోథ్‌పూర్ కోర్టు సల్మాన్‌ను దోషిగా తేలుస్తూ మిగితా నటులను నిర్దోషులుగా ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories