శ్రీదేవి మరణం వెనుక దావూద్..

Submitted by arun on Tue, 02/27/2018 - 14:48
Subramanian Swamy

శ్రీదేవి మరణంపై సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి. ఆమెది సహజ మరణం కాదని, హత్యేనని అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాదు డెత్ మిస్టరీ వెనక మాఫియా డాన్‌ దావూద్ ఇబ్రహీం ఉండొచ్చన్నారు స్వామి. బాలీవుడ్‌ తారలతో దావూద్‌కు సంబంధాలున్నాయని గుర్తు చేసిన సుబ్రమణ్య స్వామి, ఈ కోణంలో తప్పకుండా విచారణ చేయాలని కోరారు.

శ్రీదేవి డెత్‌ మిస్టరీ వెనక దావూద్‌ ఇబ్రహీం ఉండొచ్చనడానికి చాలా కారణాలున్నాయని  సుబ్రమణ్యం స్వామి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. ఎందుకంటే, శ్రీదేవి-బోనీ కపూర్‌ల మధ్య ఆస్తితగాదాలున్నాయని తెలుస్తోంది. బోనీ మొదటి భార్య పిల్లలకు, శ్రీదేవి ఇద్దరు కూతుళ్లకు ఆస్తుల పంపకాలపై వివాదాలు నడుస్తున్నాయని సమాచారం. ఇదే విషయంపై పెళ్లిలో మొదటి భార్య బంధువులకు, శ్రీదేవికి గొడవ జరిగిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముంబైలో ఆస్తుల వివాదాల్లో తలదూర్చి, డీల్స్‌ కుదిర్చే దావూద్ ఇబ్రహీం, శ్రీదేవి-బోనీ వివాదంలో జోక్యం చేసుకున్నాడన్నది సుబ్రమణ్య స్వామి ప్రశ్నలు సంధించినట్టు అర్థమవుతోంది.

ఈ నేపథ్యంలో సుబ్రమణ్య స్వామి పలు ప్రశ్నలు వేశారు. అసలు ఆ రోజు హోటల్ గదికి ఎవరెవరు వెళ్లారు ఆ గదికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను ఎందుకు విడుదల చేయడం లేదు శ్రీదేవికి మందు తాగే అలవాటు లేదన్న స్వామి, మరి ఆమె రక్తంలో ఆల్కహాల్ ఆనవాళ్లు ఎలా దొరికాయని ప్రశ్నించారు శ్రీదేవితో ఎవరైనా బలవంతంగా ఆల్కహాల్‌ తాగించి బాత్‌టబ్‌లో ముంచేసి చంపేశారా అన్న అనుమానాలను నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు సుబ్రమణ్య స్వామి. 

English Title
BJP's Subramanian Swamy raises question over Sridevi's death

MORE FROM AUTHOR

RELATED ARTICLES