తెలంగాణ బీజేపీలో వలస భయం..మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెళ్లిపోతారని ప్రచారం

తెలంగాణ బీజేపీలో వలస భయం..మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెళ్లిపోతారని ప్రచారం
x
Highlights

నిన్నమొన్నటి దాక కాంగ్రెస్‌ను వణికించిన వలసల భయం ఇప్పుడు బీజేపీకి చుట్టుకుంది. భవిష్యత్తు మాదే అని చెప్పే కమలనాధులకు తెలంగాణలో అసంతృప్తులు ఆందోళన...

నిన్నమొన్నటి దాక కాంగ్రెస్‌ను వణికించిన వలసల భయం ఇప్పుడు బీజేపీకి చుట్టుకుంది. భవిష్యత్తు మాదే అని చెప్పే కమలనాధులకు తెలంగాణలో అసంతృప్తులు ఆందోళన కల్గిస్తున్నాయి. పార్టీలోకి భారీగా వలసలు వచ్చుడేమో గాని.. భారీగా వలసలు పోయే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి కమలం పార్టీ ఆపసోపాలు పడుతోంది.

కేంద్రంలో అధికారంలో ఉన్నాం వరుస ఎన్నికలు కమలం పార్టీకే పట్టం కడుతున్నాయి ఇక భవిష్యత్తు మాదే అదే ప్రభావం తెలంగాణాలోనూ ప్రభావం చూపుతోంది దక్షణాదిన పాగవేయడానికి జాతీయపార్టీ వ్యూహం రచిస్తోంది ఊహించని స్థాయిలో బీజేపీలోకి వలసలు ఉంటాయని తెలంగాణ బీజేపీ నేతలు నిన్న మొన్నటి వరకు ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. వాళ్లు కలలు కల్లలు అవుతున్నాయి. పార్టీలోకి వచ్చిన నేతలను పార్టీ సీనియర్లు పట్టించుకోకపోవడంతో ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారు. కొందరు పార్టీ సీనియర్ల తీరును భరించలేక ఇప్పటికే రాజినామాలు చేశారు కూడ.

2014 ఎన్నికల ముందు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని చాలా మంది భారీ ఆశలు పెట్టుకొని కమలం గూటికి చేరుకున్నారు. రాష్ట్రంలో ప్రజాదరణ ఉన్ననేతలు కూడ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ కోవలోనే తాజాగా బీజేపికీ రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి . ఆయన పార్టీలో చేరిన నాటి నుంచి పార్టీ ఆయన్ను ఎక్కడ క్రియాశీలకంగా వినియోగించుకోలేదన వాదన పార్టీలో ఉంది. తాజాగా లక్ష్మన్ అధ్యక్షుడిగా భాద్యతలు తీసుకున్న కమిటీలో కూడ ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో కొమ్మూరి పార్టీ పై అసంతృప్తిగా ఉన్నారు. ఇక కొమ్మూరి ప్రతాపరెడ్డి బీజేపీకి రాజీనామా చేస్తున్నారని ప్రచారం జరుగగానే పార్టీ ముఖ్యనాయకులు తేరుకొని బుజ్జగింపులు ప్రారంబించారు. సోమవారం కొమ్మూరి ఇంటికి వెళ్లి మరీ రాజీనామా చేయవద్దని సముదాయించినా ఫలితం లేకపోయింది.

ఇక పార్టీ పై అసంతృప్తిగా ఉన్న నాగం జనార్దన్ రెడ్డితోనూ బీజేపీ రాష్ట్రస్థాయి నేతలు ఆయన నివాసానికి వెళ్లి మంతనాల జరిపారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని నాగంని వారించినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తాను పోరాడుతుంటే రాష్ట్ర బీజేపీ నాయకత్వం నుంచి తనకు ఎలాంటి సపోర్ట్‌ లభించడం లేదని, సీఎం కేసీఆర్‌తో అంటకాగే వైఖరి మార్చుకోకపోతే రాజకీయంగా గందరగోళం ఏర్పడుతుందని నాగం తీవ్రంగా అసహనం చేసినట్లు సమాచారం. నాగంతో రెండు గంటల భేటీ కూడా ఎలాంటి ఫలితాన్ని సాధించలేదు. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్ధనరెడ్డి వంటి వారు బీజేపీ వీడితే.. తెలంగాణాలో ఆ పార్టీలో సంక్షోభం మొదలవుతుందని విశ్లేషకులంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నా తెలంగాణాలో మాత్రం రాజకీయంగా దివాలా తీయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories