దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏకి ఎదురుదెబ్బ

దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏకి ఎదురుదెబ్బ
x
Highlights

దక్షిణాదిలో ఎన్డీఏ అట్టర్ ప్లాప్ అయ్యింది. భారీ మెజార్టీతో తిరిగి అధికారంలోకి వస్తుందని సర్వే సంస్థలన్నీ ఊదరగొడుతున్నా.. దక్షిణాదిలో మాత్రం ఘోర పరాభవం...

దక్షిణాదిలో ఎన్డీఏ అట్టర్ ప్లాప్ అయ్యింది. భారీ మెజార్టీతో తిరిగి అధికారంలోకి వస్తుందని సర్వే సంస్థలన్నీ ఊదరగొడుతున్నా.. దక్షిణాదిలో మాత్రం ఘోర పరాభవం తప్పడం లేదు. ఏపీ, తమిళనాడుల్లో అసలు ఖాతా తెరచుకోవడం కష్టంగా ఉంటే.. తెలంగాణ, కేరళలలో ఒకటి, అర సీట్లు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పటిలాగే ఒక్క కర్ణాటకలో మాత్రం పట్టు నిలుపుకోనుంది బీజేపీ.

బీజేపీ భారీ మెజార్టీతో కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తుందని సర్వే సంస్థలు వెల్లడించినా దక్షిణాదిలో మాత్రం ఆ పార్టీకి గట్టి షాక్ తగలబోతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క కర్ణాటకలో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడా అంత ఊపు కనిపించడం లేదు. మరోసారి బీజేపీకి భంగపాటు తప్పడం లేదు.

తెలంగాణలో అత్యధిక స్థానాలు అధికార టీఆర్‌ఎస్‌కు దక్కుతాయని, బీజేపీకి ఒకటో, రెండో దక్కుతాయని సర్వేలు చెబుతున్నాయి. టీఆర్‌ఎస్ పార్టీకి 10నుంచి 12, బీజేపీకి 1 నుంచి 3, ఎంఐఎంకి ఒకటి , కాంగ్రెస్ పార్టీకి 1 నుంచి 3 స్థానాలు దక్కుతాయని సర్వేలు చెబుతున్నాయి.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులలో అయితే ఖాతా తెరుచుకునే పరిస్థితి కూడా లేదు. ఏపీలో వైసీపీకి 18 నుంచి 20, టీడీపీకి 4 నుంచి 6, ఇతరులు ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉందంటున్నాయి. తమిళనాడులో చూస్తే డీఎంకే - 38 స్థానాలు, ఏఐఏడీఎంకే - 4 స్థానాలు దక్కించుకుంటాయంటున్నాయి. అలాగే, కేరళలో అత్యధికంగా యూడీఎఫ్ 15 నుంచి 16, ఎల్‌డీఎఫ్ 3నుంచి 5, బీజేపీ ఒక్క సీటు దక్కొచ్చని సర్వేలు చెబుతున్నాయి.

ఇక కర్ణాటకలో మాత్రం బీజేపీ పట్టు నిలుపుకొంటోంది. బీజేపీకి 21 నుంచి 25, కాంగ్రెస్‌కు 3 నుంచి 6 లోక్‌సభ స్థానాలు దక్కుతాయని సర్వేలు చెబుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఓవరాల్‌గా చూస్తే ఎన్డీఏకి ఎదురుదెబ్బ తగలడం ఖాయంగానే కనిపిస్తోంది. మరి ఈ నెల 23న విడుదల కానున్న సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలు దక్షిణాదిలో ఎన్డీఏకి ఎలాంటి ఫలితాన్నిస్తాయన్నది చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories