చిక్కుల్లో బీజేపీ ఎంపీ జీవీఎల్

Submitted by arun on Sat, 08/25/2018 - 08:23
bjp mp gvl narasimharao

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చిక్కుల్లో పడ్డారు. ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు కారు ఢీకొని ఓ మహిళ మృతిచెందిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద  శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో మరో మహిళ తీవ్రంగా గాయపడింది. గుంటూరు జిల్లా మంగళగిరి బాలాజీనగర్‌కు చెందిన తెన్నేరు అంజమ్మ (38), తోట శైలజలు కలసి మంగళగిరి నుంచి ఆటోలో కొలనుకొండ బయలుదేరారు. అక్కడివరకు వచ్చి, జాతీయ రహదారిపై గుంటూరు–విజయవాడ రోడ్డులో ఉన్న సాయిబాబా గుడి వద్ద దిగి  విజయవాడ–గుంటూరు రోడ్డులో ఉన్న యువ అకాడమీ వైపు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా, వేగంగా వస్తున్న ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు కారు వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరో
మహిళకు తీవ్రగాయాలయ్యారు. బాధితురాలి సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటన జరిగిన సమయంలో ఎంపీ జీవీఎల్.. ఆ కారులోనే ఉన్నారు. ఆ తర్వాత మరో కారులో విజయవాడకు వెళ్లారు ఆయన.

 

English Title
bjp mp gvl narasimharao car hits woman

MORE FROM AUTHOR

RELATED ARTICLES